Begin typing your search above and press return to search.

అప్పుడే అత‌డు డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్!

కోలీవుడ్ యువ సంచ‌ల‌నం అట్లీ విజ‌యాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `రాజా రాణి`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అట్లీ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   25 March 2024 9:04 AM GMT
అప్పుడే అత‌డు డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్!
X

కోలీవుడ్ యువ సంచ‌ల‌నం అట్లీ విజ‌యాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `రాజా రాణి`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అట్లీ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. అటుపై `థేరీ`..`మెర్సెల్`..`బిగిల్` లాంటి వ‌రుస విజ‌యాలు అత‌ని సొతం. అనంత‌రం పాన్ ఇండియాలో `జ‌వాన్` తో మ‌రో సంచ‌ల‌నం న‌మోదు చేసాడు. షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన ఆ సినిమాతో 1000 కోట్ల వ‌సూళ్ల‌తో అట్లీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ద‌ర్శ‌కుడిగా అత‌డికిది 5వ చిత్రం. దీంతో ఇప్పుడు డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసాడు. ఇలా వ‌రుస విజ‌యాలు అట్లీని తారా స్థాయికి చేర్చాయి. ఇప్పుడా స్థాయిని గురించి ఏకంగా `డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్` అవార్డు అందుకున్న‌ట్లు తెలుస్తోంది. `ఎన్డీటీవీ ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2024` కిగాను ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును కేంద్ర మంత్రి హ‌ర్దిప్ సింగ్ పురి చేతుల మీదుగా అందుకున్నాడు. భార‌తీయ చ‌ల‌న చిత్ర రంగానికి విశేష సేవ‌లు అందించిన కోటా లో ఈ అవార్డు అందుకున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

అయితే ఈ అవార్డు వెనుక షారుక్ ఖాన్ ఉన్న‌ట్లు అట్లీ మాట‌ల్లో క‌న‌పిస్తుంది. ఆయ‌న‌తో తెర‌కెక్కించిన జ‌వాన్ చిత్రం గురించి చెప్ప‌డంతోనే సంగ‌తి అర్ద‌మ‌వుతోంది. `షారుక్ ఖాన్ గ్లోబ‌ల్ స్టార్. 30 ఏళ్ల‌గా ఆయ‌న కాపాడుకుంటూ వ‌స్తోన్న ఇమేజ్..స‌త్తాని సినిమా అనే మాద్య‌మం ద్వారా జ‌నాల‌కు చూపించాను. 2019 లో తొలిసారి ఐపీఎల్ లో ఆయ‌న్ని క‌లిసాను. అప్పుడే ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని డిసైడ్ అయ్యాను. అందుకోసం ఎన్నో నిద్ర లేని రాత్రుళ్లు గ‌డిపాను. జ‌వాన్ జ‌ర్నీ నా కెరీర్ మొత్తంలోనే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దిగా నిలిచిపోతుంది` అన్నారు.

అట్లీ ఐదు సినిమాల‌కే డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అందుకోవ‌డం నిజంగా గొప్ప విష‌యం. ఎన్నో సినిమాలు చేస్తే రానీ గుర్తింపు..ఎంతో అనుభ‌వం ఉంటేగానీ రాని అవార్డు ఐదు సినిమాల‌తోనే సాధించాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలే అట్లీ కోసం క్యూలో ఉన్నారు. ఇక‌పై అట్లీ ఏ సినిమాచేసినా అది పాన్ ఇండియా చిత్రంగానే ప్లాన్ చేయున్నార‌ని తెలుస్తోంది. ఈ రేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు.