Begin typing your search above and press return to search.

శిష్యుడు గురువునే మించిపోయేలా!

శంక‌ర్ గ‌తంలో ఎలాంటి విజ‌యాలు అందించారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు అయ్యారు.

By:  Tupaki Desk   |   9 April 2025 3:30 PM
Atlee Surpassed Shankar In Vfx Movies
X

శంక‌ర్ గ‌తంలో ఎలాంటి విజ‌యాలు అందించారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు అయ్యారు. `జెంటిల్మెన్`, భార‌తీయుడ‌, జీన్స్, రోబో, 2.0 లాంటి చిత్రాల‌తో దేశం మీసం తిప్పారు. శంక‌ర్ లా సినిమాలు తీయ‌డం అంటే అది కేవ‌లం అత‌డికి మాత్ర‌మే సాధ్యం. ఆయ‌న కెరీర్ మొత్తంలో ఇప్ప‌టివ‌ర‌కూ చేసింది చాలా త‌క్కువ సినిమాలే. 15 సినిమాల‌కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అయితే కొంత కాలంగా శంక‌ర్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. చేసిన ఏ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌ని సంగతి తెలి సిందే. అలాగే శంక‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన చాలా మంది ద‌ర్శ‌కులయ్యారు. కానీ అట్లీ రేంజ్లో ఎవ‌రూ స‌క్సెస్ అవ్వ‌లేదు. అట్లీ పాన్ ఇండియాలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. షారుక్ ఖాన్ తో `జ‌వాన్` తీసి ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయాడు. త్వ‌ర‌లో ఐకాన్ స్టార్ అట్లీతో ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో విజువ‌ల్ ఎపెక్స్ట్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. దీనిలో భాగంగా ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా అమెరికాకు చెందిన కంపెనీ స్టూడియోనే ప‌ని చేస్తోంది. అంటే ఈ సినిమాలో సీజీకి ఎంత ప్రాధాన్య‌త ఉంద‌న్న‌ది అర్ద‌మ‌వుతుంది. సాధార‌ణంగా ఇలాంటి టెక్నిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయ‌డంలో శంక‌ర్ మాస్ట‌ర్. అందుకే `రోబో`, `2.0` లాంటి గొప్ప చిత్రాలు ప్రేక్ష‌కులు చూడ‌గ‌లిగారు.

తాజాగా శంక‌ర్ శిష్యుడు గురువుకు పోటీగానే? బ‌న్నీతో చిత్రాన్ని సీజీకి ప్రాధాన్య‌త ఇచ్చి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే క‌లెక్ష‌న్ల ప‌రంగానూ గురువు కంటే శిష్యుడే టాప్ పోజీష‌న్ లో ఉన్నాడు. ఇంత‌వ‌ర‌కూ శంక‌ర్ కి ఒక్క 1000 కోట్ల వ‌సూళ్ల సినిమా కూడా లేదు. కానీ అట్లీకి మాత్రం `జ‌వాన్ `ఉంది. బ‌న్నీతో సినిమా చేస్తోన్న నేప‌థ్యంలో ఈ సినిమా ఏకంగా 2000 కోట్ల‌కు పైగా టార్గెట్ చేసి ఉంటార‌ని అంచ నాలొస్తున్నాయి. శంక‌ర్ ఇప్ప‌ట్లో ఇలాంటి సినిమా తీయ‌డం సాధ్య‌కాదు క‌దా?.. క‌నీసం కోలుకోగ‌ల‌డా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే శిష్యుడు గురువును మించిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది.