అట్లీ వెనుక కోలీవుడ్ రాజకీయమా?
కోలీవుడ్ లో అట్లీకి తిరుగు లేదు. ఇంతవరకూ వైఫల్యమన్నదే ఎదురవ్వలేదు. తీసిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 10:30 AM ISTకోలీవుడ్ లో అట్లీకి తిరుగు లేదు. ఇంతవరకూ వైఫల్యమన్నదే ఎదురవ్వలేదు. తీసిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. నాలుగు సినిమాలు తమిళ హీరోలతోనే తెరకెక్కించి భారీ విజయాలు అందుకు న్నాడు. కానీ ఐదవ చిత్రం 'జవాన్' మాత్రం బాలీవుడ్ లో తెరకెక్కించి ఏకంగా 1000 కోట్ల వసూళ్ల చిత్రాన్నే షారుక్ ఖానకు...బాలీవుడ్ కు అందించాడు. మరి ఈ సక్సెస్ తో అట్లీపై కోలీవుడ్ లో రాజకీయం అలుముకుందా? అందుకు బన్నీ 22 మరింత ఆద్యం పోసిందా? అంటే అవుననే కథనాలొస్తున్నాయి.
సినిమా కు భాషతో సంబంధం లేదు. ఏ హీరో ఏ డైరెక్టర్ తోనైనా సినిమా చేసుకోవచ్చు. ఏ డైరెక్టర్ అయిన దేశంలో ఏ నటుడి తోనైనా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. అది వారి సామార్ధ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మంచి సక్సెస్ లుంటే స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తారు. డైరెక్టర్లు కూడా అంతే ఉత్సాహం చూపిస్తారు. అట్లీ-బన్నీ కాంబినేషన్ కూడా అలా కుదిరిందే. అట్లీ ఇలా ఇతర పరిశ్రమల హీరోలతో సినిమాలు చేయడంపై కోలీవుడ్ లో కొన్ని నిర్మాణ సంస్థలు గుర్రుగా ఉన్నాయట.
సొంత భాషల హీరోలను పక్కనబెట్టి ఇతర భాషల్లో సినిమాలు చేయడం ఏంటనే విమర్శ వ్యక్తమవుతుంది. వాస్తవానికి బన్నీ సినిమాని కోలీవుడ్ లో రాజకీయ పలుకబడి ఉన్న నిర్మాణ సంస్థ నిర్మించాలి అట. కానీ అందులో హీరోగా కోలీవుడ్ కి చెందిన నటుడై ఉండాలని ప్రపోజల్ పెట్టిందట ఆ సంస్థ. దీంతో అట్లీ ఆ సంస్థ ను వదిలేసి సన్ పిక్చర్స్ వద్దకు వెళ్లడం. ..అక్కడ ఎలాంటి కండీషన్లు లేకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ అయినట్లు చెబుతున్నారు.
'జవాన్' తర్వాత కొత్త సినిమా ప్రకటించడానికి ఆలస్యానికి అసలు కారణం ఇదేనని తాజాగా వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి అట్లీ తాజా స్టోరీని మూడేళ్ల క్రితమే సిద్దం చేసి పెట్టాడుట. టెక్నికల్ అంశాలున్న సినిమా కావడంతో అప్పుడు తెరపైకి తేలేదని వినిపిస్తుంది. అటుపై బన్నీ పాన్ ఇండియా స్టార్ అవ్వ డం...తన కథకి పర్పెక్ట్ గా సెట్ అవుతాడనే ఆలోచనతో మరో హీరోకి చెప్పకుండా నేరుగా బన్నీకి చెప్పడం..ఒకే చేయడం అంతా వేగంగా జరిగిపోయిందన్నది తాజా సమాచారం.
