'రాకా' తర్వాత అట్లీ జవాన్ 2!
ప్రస్తుతం కోలీవుడ్ సంలచనం అట్లీ `రాకా` ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ ఇది.
By: Tupaki Desk | 24 April 2026 1:00 PM ISTప్రస్తుతం కోలీవుడ్ సంలచనం అట్లీ `రాకా` ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ ఇది. ఈసినిమా విజయం సాధిస్తే గ్లోబల్ స్థాయిలో అట్లీ-బన్నీ పేరను మారు మ్రోగిపోతుంది. ఈ చిత్రం అనంతరం ఎలాంటి దర్శకులతో పనిచేయాలి? అన్నది ముండే డిసైడ్ అయ ఇ ఉన్నాడు. మరి అట్లీ సంగతేంటి? అంటే?..మరోసారి బాద్ షా షారుక్ ఖాన్ నే తన హీరోగా ఎంచుకున్నట్లు తెలు స్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `జవాన్` ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే.
ఇద్దరి కెరీర్ లో ఇదో మరో మైలురాయి.
ఈ నేపథ్యంలో ఇదే చిత్రానికి సీక్వెల్‌గా `జవాన్ 2`ను తెరకెక్కించేందుకు అట్లీ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి షారుఖ్ ఖాన్‌తో ప్రాథమిక చర్చలు ముగిశాయని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. `జవాన్` ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి, షారుఖ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాలో విక్రమ్ రాథోడ్, ఆజాద్ వంటి పవర్‌ఫుల్ పాత్రలను అట్లీ తీర్చిదిద్దిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ కథను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అందుకు షారుఖ్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
`జవాన్ 2` కథాంశం ఎలా ఉండబోతోందనే దానిపై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి భాగంలో సామాజిక సమస్యలను చర్చిస్తూనే మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా పండించిన అట్లీ సీక్వెల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రైమ్ లేదా పొలిటికల్ థ్రిల్లర్ అంశాలను జోడించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ నటన , అట్లీ మేకింగ్ స్టైల్ తోడైతే అది వేరే లెవల్ అంటూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ వార్తలపై షారుఖ్ ఖాన్ టీమ్ నుండి కానీ, ఇటు అట్లీ నుండి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అట్లీ ప్రాజెక్టులను ఎంతో గోప్యంగా ఉంచుతాడు. సరైన సమయం చూసి భారీ ప్రకటన చేయడమే ఆయన శైలి.
`రాకా` తర్వాత అట్లీ చేయబోయే సినిమాపై వస్తోన్న వార్తలు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. షారుఖ్ - అట్లీ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళితే అది ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. `రాకా` సినిమా పూర్తయ్యేలోపు `జవాన్ 2` స్క్రిప్ట్ పనులను కూడా అట్లీ పూర్తి చేస్తాడని తెలుస్తోంది.
