అవన్నీ కాపీ కాదు, నిజ జీవితంలో జరిగినవే!
ఇండియన్ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకరు. రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ ఇలా ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే.
By: Tupaki Desk | 15 Jun 2025 11:06 AM ISTఇండియన్ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకరు. రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ ఇలా ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే. కోలీవుడ్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేసి అందరూ తన గురించి మాట్లాడేలా చేశారు అట్లీ.
కళా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు గా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ అట్లీని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 35వ కాన్వకేషన్ లో భాగంగా అట్లీకి ఆ డాక్టరేట్ ను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. తనకు డాక్టరేటును ప్రదానం చేసిన సందర్భంగా ఆ కార్యక్రమంలో అట్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దాంతో పాటూ అట్లీ రెగ్యులర్ గా ఫేస్ చేసే అతి పెద్ద ఆరోపణపై కూడా ఆయన నోరు విప్పారు.
అట్లీ తీసే సినిమాలన్నీ కాపీ చేసినవే అని ఆయనపై పలు ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఇప్పటివరకు అట్లీ ఎప్పుడూ దాని గురించి మాట్లాడింది లేదు. కానీ తనకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అట్లీ మాట్లాడుతూ ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను తీసిన సినిమాలన్నీ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయి తీసినవే అని అట్లీ వివరించారు.
తన సినిమాలను ఆడియన్స్ కాపీ అంటూ ఉంటారని, కానీ అదంతా తన లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన సీన్స్ అని, ఉదాహరణకు బిగిల్ లోని రాయప్పన్ క్యారెక్టర్ JPR సర్ నుంచి స్పూర్తి పొందిందని, ఆయన చదువులకు, క్రీడలకు ఎంతో సాయం చేసేవారని అట్లీ అన్నారు. సత్యభామ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ లో షార్ట్ ఫిల్మ్ తీయడానికి JPR ను కలవమన్నారని, ఆయన కెమెరా తీసుకో, త్వరగా డైరెక్టర్ అవుతావన్నారని, తర్వాత ఆయన చెప్పిన మాటే నిజమైందని, తాను డైరెక్టర్ అయ్యే వరకు మొత్తం తన తల్లిదండ్రులే చూసుకున్నారని, తాను మంచి మనిషిగా ఉండటానికి కారణం తన భార్య, కొడుకు అని అట్లీ తెలిపారు.
మీరు నాకు డాక్టరేట్ ఇచ్చారు, నేను ఈ దేశం గర్వించేలా చేస్తానని అట్లీ ఈ సందర్భంగా మాటిచ్చారు. తన తర్వాతి సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ లోAA22 ను అల్లు అర్జున్ తో తీయబోతున్నానని, ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, కొత్త టెక్నాలజీతో ఇండియన్ సినీ చరిత్రలోనే దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నామని, సినిమా బడ్జెట్ ఎంతనేది ఇంకా క్లారిటీ రాలేదని, రిలీజ్ డేట్ విషయాన్ని నిర్మాత అనౌన్స్ చేస్తారని అట్లీ తెలిపారు.
