Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ వైఫ్ కం హీరో కూతురు ఫ్రెగ్నెంట్

స్టార్ క్రికెటర్ వైఫ్‌ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంద‌నేది తాజా గుస‌గుస‌. ఇందులో నిజం ఎంత‌? అంటే... నిప్పు లేనిదే పొగ రాదు క‌దా! అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 5:49 AM GMT
క్రికెట‌ర్ వైఫ్ కం హీరో కూతురు ఫ్రెగ్నెంట్
X

గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యుత్త‌మంగా రాణించిన స్టార్ క్రికెట‌ర్ పాపుల‌ర్ హీరో కుమార్తె కం న‌టిని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట త‌ల్లిదండ్రులు అవుతున్నార‌ని తెలిసింది. ఈ ఎపిసోడ్‌లో స్టార్ క్రికెట‌ర్ కె.ఎల్.రాహుల్ కాగా, అత‌డు పెళ్లాడింది బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె ఆథియాని అని ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు.

స్టార్ క్రికెటర్ వైఫ్‌ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంద‌నేది తాజా గుస‌గుస‌. ఇందులో నిజం ఎంత‌? అంటే... నిప్పు లేనిదే పొగ రాదు క‌దా! అని అంటున్నారు. న‌టితో స్టార్ క్రికెటర్ త్వరలో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస‌గుస వినిపిస్తోంది. ముంబైలో జరిగిన డ్యాన్స్ ఆధారిత షోలో సునీల్ శెట్టి ఇదే విషయాన్ని సూచించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

స్టార్ క‌పూల్ ఇంకా ఈ వార్త‌ను అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ ముంబై సర్కిల్‌లలో వైరల్‌గా మారింది. KL రాహుల్ ప్రస్తుతం IPL 2024లో ఆడుతున్నాడు. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కూ అత‌డు ఆట‌లో ఇదే జోష్ ని కొన‌సాగిస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. బ్యాట్స్ మ‌న్ కం వికెట్ కీప‌ర్ గా అత‌డికి అరుదైన రికార్డులు ఉన్నాయి.