Begin typing your search above and press return to search.

మా ఆయ‌న‌పై అత్త‌మ్మ కారాలు..మిరియాలు!

బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి-క్రికెట‌ర్ కె.ఎల్ రాహుల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 April 2025 7:30 PM
Athiya Shetty Opens Up About KL Rahul
X

బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి-క్రికెట‌ర్ కె.ఎల్ రాహుల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రోఫెష‌న‌ల్ గా అతియా కెరీర్ యాక్టివ్ గా లేదు. నాలుగైదు సినిమాల‌తో ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. గ‌త ఐదేళ్ల‌గా సినిమాలు చేయ‌లేదు. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంది గానీ రావ‌డం లేదు. వివాహం త‌ర్వాత రాహుల్ ఎలాంటి ప‌రిమితులు విధించ‌లేదు. కావాల్సినంత స్వేచ్ఛ క‌ల్పించినా ఛాన్సులే క‌నిపించ‌లేదు.

రాహుల్ కూడా ఆ మ‌ధ్య వైఫ‌ల్యం అయినా మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ఫాంలోకి వ‌స్తున్నాడు. బ్యాట్ తో విమ‌ర్శ‌కుల‌కు సరైన స‌మాధానం ఇస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో స‌త్తా చాటుతున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భ‌ర్త గురించి...ఇంట్లో సంగ‌తుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. `రాహుల్ నెమ్మ‌ద‌స్తుడు. త‌క్కువగా మాట్లాడుతాడు. ఒక్క క్రికెట్ మైదానంలో త‌ప్పించి మిగ‌తా ఎక్క‌డైనా మాట్లాడ‌టానికి ఇబ్బంది ప‌డ‌తాడు.

పెళ్లాయ్యాక చాలా మారాడు. రాహుల్ బాగా చ‌దువుకోవాల‌న్న‌ది మా అత్త‌గారి కోరిక‌. అందుకే త‌ను ఇంటికి వ‌చ్చిన‌ప్పుడల్లా మ‌ధ్య‌లో వ‌దిలేసిన డిగ్రీ పూర్తి చేయ‌మ‌ని పోరు పెడ‌తారు. రాహుల్ కూడా ఆర్బీఐ మేనేజ‌ర్ హోదాలో ఉన్నాడు. అత్తయ్య ఎప్పుడు క్రికెట్ గురించి కాకుండా చ‌దువు ,ఆర్బీఐ గురించి అడుగు తుంటారు. వాళ్లిద్ద‌రు మాట్లాడుకుంటే పొట్లాడుకుంటున్న‌ట్లే ఉంటుంది. ఆ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌దు.

ఒక‌రంటే ఒక‌రు కారాలు మిరియాలు నూరుతారు` అని న‌వ్వేసింది. అతియాశెట్టి సునీల్ శెట్టి వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తండ్రి హీరోగా ఓ వెలుగు వెలిగినా త‌ర్వాత కాలంలో స‌రైన అవ‌కాశాలు అందుకోలేక‌పోయారు. అతియా ఆ మాత్రం కూడా సాధించ‌లేక‌పోయింది.