Begin typing your search above and press return to search.

"అతిథి".. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !!

కర్మకి ఫలితంగా శిక్ష దేవుడే వేయాల్సిన లేదు.. కొన్నిసార్లు దెయ్యం కూడా వెయ్యొచ్చు అని రుజువు చేయడానికి వచ్చింది "అతిథి" కథ.

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:44 AM GMT
అతిథి.. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !!
X

కర్మకి ఫలితంగా శిక్ష దేవుడే వేయాల్సిన లేదు.. కొన్నిసార్లు దెయ్యం కూడా వెయ్యొచ్చు అని రుజువు చేయడానికి వచ్చింది "అతిథి" కథ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ అద్భుతమైన రివ్యూస్ సొంతం చేసుకుంది. అందరూ ఈ సిరీస్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకునేలా చేసింది.

ఒక రవివర్మ.. ఒక రాజభవనం.. ప్రధానంగా నలుగురు మనుషుల చుట్టూ తిరుగుతున్న ఈ కథ లో దయ్యం ప్రతి క్షణం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దోచుకోవాలని ఇద్దరు, కాపాడాలని ఒకరు ఆ రాజభవనంలోకి వెళ్ళాకా లోపల వాతావరణం అనూహ్యంగా అంచనాలకు అందకుండా ఉంటుంది.

అసలు ఈ రవివర్మ ఎవరు, అతని కథ ఏంటి? అతని గురించి రెండు రకాల ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు; మారే మనుషుల మనస్తత్వాలు, పరిస్థితులూ అవకాశాలూ మార్చేసే ఆలోచనలు కథని ఎలా నడిపాయో తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ హారర్ థ్రిల్లర్ ని చూడాల్సిందే.

ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వేణు తొట్టెంపూడి ఇందులో ఒక విభిన్నమైన పాత్ర చేశారు. సమంత క్యారెక్టర్ లో అవంతిక మిశ్రా, సావరి గా వెంకటేష్ కాకుమాను, ప్రకాష్ గా రవి వర్మ గొప్పగా చేశారని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నో సినిమాల్లో, ప్రతిష్టాత్మక బ్యానర్స్ లో దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న వైజీ భరత్ ఈ సిరీస్ కి రచయిత, దర్శకుడు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. ఇలా అద్భుతమైన నటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు మలిచిన ఈ "అతిథి" ఒక సిరీస్ కాదు. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. "అతిథి" డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు మరిచిపోలేని కనువిందు.

"అతిథి" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3RoN7AU

Content Produced by: Indian Clicks, LLC