అతడు 2.. అనుకుంటే సరిపోదు..?
టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో అతడు ఒకటి. ఐతే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మురళీ మోహన్ ని అతడు 2 ఉంటుందా అని రిపోర్టర్స్ అడిగారు.
By: Tupaki Desk | 27 July 2025 12:24 PM ISTసూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అతడు. 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ మూవీగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మణిశర్మ మ్యూజిక్, మాటల మాంత్రికుడు త్రివిక్రం మాయాజాలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది. ఐతే అతడు సినిమాను మళ్లీ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా 4కె వెర్షన్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ రిలీజ్ కోసం జయభేరి ఆర్ట్స్ అధినేత సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ రంగంలోకి దిగారు. సినిమాను నిర్మించింది ఆయనే అని తెలిసిందే. అతడు సినిమా మహేష్, త్రివిక్రం ల కలయికలో ఏర్పడిన తొలి సినిమా ఈ సినిమా 4కె ప్రింట్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు.
అతడు 2 ఉంటుందా..
టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో అతడు ఒకటి. ఐతే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మురళీ మోహన్ ని అతడు 2 ఉంటుందా అని రిపోర్టర్స్ అడిగారు. దానికి ఆయన ఆన్సర్ ఇస్తూ అతడు 2 ఉంటే అది మహేష్, త్రివిక్రం మాత్రమే చేయాలి. వేరే వాళ్లతో తీసే ఛాన్స్ లేదని అన్నారు.
అతడు 2 అసలు ఉంటుందా అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మహేష్, త్రివిక్రం మళ్లీ కలిసి పనిచేయడం ఇప్పుడప్పుడే జరగదు. గుంటూరు కారం సినిమాతో వీళిద్దరు కలిసి పనిచేశారు. మళ్లీ అతడు 2 కథ కుదిరి సెట్ అవ్వాలంటే అది కుదరదనే చెప్పాలి.
అతడు పవన్ కళ్యాణ్..
అతడు బ్యాక్ స్టోరీ గురించి ఒక లుక్కేస్తే.. త్రివిక్రం ఈ కథను ముందు పవన్ కళ్యాణ్ కి చెప్పారు. ఐతే ఆ సినిమా కథ వినే టైం లో పవన్ కాస్త మత్తుగా ఉండి నిద్రపోయాడట. కథ మొత్తం అయ్యాక లేచారట. ఐతే ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ లేదని పవన్ కళ్యాణ్ ని వదిలి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేశాడు త్రివిక్రం.
అతడు సినిమా లో మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ ఖలేజా, గుంటూరు కారం సినిమాలు చేశారు.
