Begin typing your search above and press return to search.

వీడియో: మ‌రీ స్కూల్ పిల్ల‌లా మారిన‌ వేదిక

న‌టిగా వరుస కమర్షియల్ చిత్రాలలో బబ్లీ గర్ల్ పాత్రను పోషించిన తర్వాత, 'బాణం'లో శుభ లక్ష్మి పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 5:22 AM GMT
వీడియో: మ‌రీ స్కూల్ పిల్ల‌లా మారిన‌ వేదిక
X

'బాణం' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది క్యూట్ బ్యూటీ వేదిక‌. నారా రోహిత్ స‌ర‌స‌న ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించిన ఈ బ్యూటీకి ఆ త‌ర్వాత బాల‌కృష్ణ, ఆది సాయికుమార్ లాంటి హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలొచ్చాయి. కానీ వేదిక కెరీర్ టాలీవుడ్ లో ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు. అదే క్ర‌మంలో ఇత‌ర స్టార్ల త‌ర‌హాలోనే సోష‌ల్ మీడియాల్లో వేదిక స్పీడ్ పెంచింది.

తెలుగు త‌మిళంలో ప్ర‌ధానంగా న‌టించిన వేదిక పూర్తి పేరు వేదిక కుమార్. షోబిజ్ లో వేదిక కుమార్ ప్రయాణం నెమ్మ‌దిగానే సాగింది. న‌టిగా వరుస కమర్షియల్ చిత్రాలలో బబ్లీ గర్ల్ పాత్రను పోషించిన తర్వాత, 'బాణం'లో శుభ లక్ష్మి పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తన ఆకట్టుకునే అందం న‌ట‌న‌తో యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. కొంతకాలం విరామం తర్వాత, త‌మిళ దర్శకుడు బాల తెర‌కెక్కించిన‌ జాతీయ అవార్డు చిత్రం `పరదేశి`లో మునుపెన్నడూ చూడని అవతార్‌లో క‌నిపించింది.

అంగమ్మ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా న‌టించి మెప్పించిన వేదిక‌ ఒళ్ళు గగుర్పొడిచే క్లైమాక్స్‌లో షో స్టాప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పించింది. కానీ త‌మిళంలోను వేదిక‌కు ఆశించిన‌న్ని అవ‌కాశాలు రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019లో బాలకృష్ణ రూలర్‌తో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. అదే సంవత్సరంలో స్పానిష్ చిత్రం హిందీ రీమేక్ అయిన 'ది బాడీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 30 ప్ల‌స్ ఏజ్ లో ఉన్న వేదిక ఇప్ప‌టికీ త‌న రూపాన్ని అందంగా మెయింటెయిన్ చేయ‌డం కోసం చాలా శ్ర‌మిస్తోంది. తాజాగా సోష‌ల్ మీడియాల్లో వేదిక షేర్ చేసిన ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో వేదిక ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే అన్న తీరుగా మారిపోయి క‌నిపిస్తోంది. పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయి ఇంకా టీన్ వైబ్స్ తో వేదిక అందం క‌ట్టి ప‌డేస్తోంది.