Begin typing your search above and press return to search.

మెల్లగా ఎక్కుతున్న డెవిల్ కిక్

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా డెవిల్ నిలిచింది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 9:41 AM GMT
మెల్లగా ఎక్కుతున్న డెవిల్ కిక్
X

కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ లో అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటిరోజు ఊహించిన విధంగా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా డెవిల్ నిలిచింది.

సినిమాలో ప్రధానమైన ట్విస్ట్ లు ఆడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అలాగే క్రైమ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతూ ఉన్నాయి.

వీకెండ్ లో న్యూ ఇయర్ కూడా ఈ సినిమా మంచి నెంబర్స్ ఐతే క్రియేట్ చేస్తోంది. ఇక ఈరోజు కూడా చాలా ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ రోజు భిన్నమైన అభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా సినిమా అయితే ఇప్పుడు జనాలకు నెమ్మదిగా ఎక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. చూస్తూ ఉంటే వారంలో కూడా డెవిల్ మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

ఎందుకంటే పోటీగా కూడా ఇతర పెద్ద సినిమాలు ఏమీ ఇప్పుడు లేవు మళ్ళీ సంక్రాంతి నుంచే సినిమాల హడావిడి మొదలవుతుంది. ఆలోపు డెవిల్ సినిమా మంచి కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. ఇక మూడు రోజులు ఈ సినిమా దాదాపు 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా విడుదలకు ముందే నిర్మాతకు నాన్ థియేట్రికల్ గా దాదాపు 20 కోట్ల ఆదాయం అయితే వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మరికొన్ని రోజులు డెవిల్ ఇలానే కొనసాగితే మంచి ప్రాఫిట్స్ అందించే అవకాశం ఉంటుంది.