Begin typing your search above and press return to search.

అసిన్ డాట‌ర్ అచ్చుగుద్దిన‌ట్లే అమ్మ‌లా

ఇక అసిన్ కుమార్తె అమ్మ‌కి అచ్చు గుద్దిన‌ట్లే ఉంది. ఆరేళ్లు రావ‌డంతో పొలిక‌లు స్ప‌ష్టంగా తెలుస్తున్నాయి. ముఖ‌భాగ‌మంతా అసిన్ త‌లపిస్తుంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 2:30 PM GMT
అసిన్ డాట‌ర్ అచ్చుగుద్దిన‌ట్లే అమ్మ‌లా
X

అసిన్ వివాహం త‌ర్వాత వెండి తెర‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను వివాహ‌మాడిన త‌ర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే అంకిత‌మైపోయింది. ఈ దంప‌తుల‌కు అరిన్ అనే కుమార్తె ఉంది. ఇక అసిన్ సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌తో పాటు త‌న వివ‌రాలు కూడా గోప్యంగా ఉంటున్నాయి. స‌హ న‌టులంతా అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్నా! అసిన్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోవ‌డం లేదు.

భ‌ర్త‌..పాప అంటూ కొత్త జీవితంలో బిజీ అయిపోయారు. తాజాగా కుమార్తె పుట్టిన రోజువేడుక‌ను సైతం ఎంతో నిరాడంబ‌రంగా సెల‌బ్రేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కుమార్తె ఆరవ పుట్టిన రోజు ఇది. ప్యారిస్ లోని ఓ హోటల్ లో ఈ వేడుక చాలా సింపుల్ గా జ‌రిగింది. టేబుల్ పై ఒక క్యాండిల్ వెలిగించి.. సింపుల్ గా బర్త్ డే వేడుక నిర్వహించారు. ఈ ఫొటోని అసిన్ నెట్టింటి షేర్ చేసింది. బ‌ర్త్ డే వెకేష‌న్ గా భర్త ప్యారిస్ తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఇక అసిన్ కుమార్తె అమ్మ‌కి అచ్చు గుద్దిన‌ట్లే ఉంది. ఆరేళ్లు రావ‌డంతో పొలిక‌లు స్ప‌ష్టంగా తెలుస్తున్నాయి. ముఖ‌భాగ‌మంతా అసిన్ త‌లపిస్తుంది. చెవులు..క‌ళ్లు..ముఖ్కు..చెంప‌లు అన్నీ అసిన్ ని పోలాయి. క్యూట్ గా స‌న్న‌గా ఉంది. మొత్తంగా అసిస్ షేపులతోనే పాప హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అసిన్ కుమార్తె ఫోటో కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఇదే తొలిసారి. దీంతో అసిన్ అభిమానులు కుమార్తెను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. జూనియ‌ర్ అసిన్ అంటూ పొగిడేస్తున్నారు. అసిన్ చివరిగా 2015లో `ఆల్ ఈజ్ వెల్` సినిమాలో కనిపించింది. 2016లో వివాహం తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. మళ్లీ నటించే అవకాశాలు కూడా లేవని అసిప్ అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది. తెలుగులో `అమ్మ నాన్న త‌మిళ అమ్మాయి`..`ఘర్షణ`..`శివ‌మ‌ణి` లాంటి సినిమాలు చేసింది.