Begin typing your search above and press return to search.

ఏషియన్ తో మైత్రీకి గొడవేంటి? ఇంకెప్పుడు 'వీరమల్లు' బుకింగ్స్?

అయితే నైజాంలో అత్యధిక థియేటర్ల చైన్ బిజినెస్ కలిగిన ఏషియన్ సినిమాస్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   23 July 2025 12:18 PM IST
ఏషియన్ తో మైత్రీకి గొడవేంటి? ఇంకెప్పుడు వీరమల్లు బుకింగ్స్?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరి హర వీరమల్లు మూవీ కోసం అంతా ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్లపాటు సెట్స్ పై ఉండిపోయిన ఆ సినిమాను విట్నెస్ చేసేందుకు వేయి కళ్లతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరికొన్ని గంటల్లో పెయిడ్ ప్రీమియర్స్ తో విడుదల కానుంది.

మూడేళ్ల తర్వాత పవన్.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండడంతో ఫ్యాన్స్ అయితే మామూలుగా హంగామా చేయడం లేదు. కటౌట్స్, బ్యానర్స్ తో ఫుల్ గా సందడి చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా జోరుగా సాగుతున్నాయి. హాట్ కేకుల్లా వీరమల్లు సినిమా టికెట్స్ అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నైజాంలో అత్యధిక థియేటర్ల చైన్ బిజినెస్ కలిగిన ఏషియన్ సినిమాస్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. అందుకు పర్సంటేజ్ విధానం విషయంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్, ఏషియన్ సినిమాస్ మధ్య ఒప్పందం కుదరకపోవడమే కారణంగా తెలుస్తోంది. నైజాంలో వీరమల్లును మైత్రీ డిస్టిబ్యూషన్ పంపిణీ చేస్తోంది.

ఏషియన్ సినిమాస్ తమ పర్సంటేజ్ నిబంధనలపై స్థిరంగా ఉందని తెలుస్తోంది. మైత్రీ సంస్థ కూడా పట్టుదలగా ఉందని సమాచారం. దీంతో రెండు వైపులా సరైన అంశాలు ఉన్నాయి, కానీ ఇద్దరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని వినికిడి. రెండు సంస్థల వాదనల్లో కరెక్ట్ పాయింట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

అందుకే ప్రీమియర్స్ కు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న కూడా ఏషియన్ సినిమాస్ సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదని అర్థమవుతుంది. అయితే పర్సెంటేజ్ ఇష్యూను నిశ్శబ్దంగా పరిష్కరించుకోకపోయినా లేక మరింతగా కొనసాగించినా.. దాని ప్రభావం కచ్చితంగా సినిమా ఓపెనింగ్స్ పై పడుతుందని చెప్పాలి.

అయితే పుష్ప-2 సమయంలో కూడా అలాగే జరిగింది. ప్రసాద్ ఐమ్యాక్స్ తో విభేదాలు వచ్చి.. అక్కడ ఏకంగా సినిమా ప్రదర్శించలేదు మైత్రీ సంస్థ. ఇప్పుడు వీరమల్లు విషయంలో వాళ్లతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. వ్యవహారం సాఫీగా సాగింది. కానీ ఏషియన్ సినిమాస్ వాళ్లతో లెక్కలు కుదరలేదు. మరి ఈ విషయంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏం చేస్తుందో వేచి చూడాలి.