Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : అశ్విని ఔట్.. ఆమె కూడా..!

ఈ వారం అశ్విని నామినేషన్ లో సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది. నాగార్జున కూడా ఎపిసోడ్ స్టార్టింగ్ లో దాని గురించి మాట్లాడుతూ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం అనేది బిగ్ మిస్టేక్ అని చెప్పారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:35 AM GMT
బిగ్ బాస్ 7 : అశ్విని ఔట్.. ఆమె కూడా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని లాస్ట్ వీకే చెప్పారు హోస్ట్ నాగార్జున. అయితే ఉల్టా పుల్టా కదా చెప్పిందు ఎందుకు చేస్తాం అంటూ ఈ వారం ఒక్క ఎలిమినేషనే ఉంటుందని అనుకున్నారు. కానీ వారి అంచనాలను బ్రేక్ చేస్తూ ఈ శనివారం రోజే అశ్వినిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. శనివారం ఎపిసోడ్ లో శుక్రవారం జరిగిన హౌస్ విషయాలను చూపించి ఆ తర్వాత శివాజి హెల్త్ ఇష్యూ గురించి చర్చించారు.

ముందు హౌస్ నుంచి వెళ్లాలని అనుకున్న శివాజి నాగార్జున మాటలకు కన్విన్స్ అయ్యి హౌస్ లో కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రతి వారం సేఫ్ నుంచి మొదలు పెట్టే నాగార్జున ఈ వారం డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేశారు. ఈ క్రమంలో అశ్విని ఎలిమినేట్ అని చెప్పారు.

ఈ వారం అశ్విని నామినేషన్ లో సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది. నాగార్జున కూడా ఎపిసోడ్ స్టార్టింగ్ లో దాని గురించి మాట్లాడుతూ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం అనేది బిగ్ మిస్టేక్ అని చెప్పారు. అయితే అశ్విని ఎలిమినేషన్ టైం లో పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ తో అశ్విని సేవ్ చేస్తావా అని అడిగారు. కానీ ప్రశాంత్ దాన్ని 14వ వారం మాత్రమే వాడతానని చెప్పాడు.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శివాజి, ప్రశాంత్, యావర్, గౌతం, అమర్, అర్జున్, రతిక వీరిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవుతారు. అయితే అశ్వినితో పాటుగా రతిక కూడా ఎలిమినేట్ అయ్యిందని ఆల్రెడీ బిగ్ బాస్ లీక్స్ బయటకు వచ్చాయి. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అవుతారు. మరి వీరిలో టాప్ 5 వరకు ఎవరు ఉంటారు.. ఎవరు విన్నర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే 3 వారాల్లో ఆట మరింత రసవత్తరంగా మారనుంది. టాప్ 5 రేసులో ఉండాలని అందరు అనుకుంటున్నారు. శివాజి, యావర్, పల్లవి ప్రశాంత్ ఓ పక్క అమర్, అర్జున్, శోభా శెట్టి, ప్రియాంక ఇలా స్టార్ మా బ్యాచ్ ఒక పక్క ఆటని వారి చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఆడియన్స్ మనసులు గెలిచేది ఎవరు ఫైనల్ దాకా నిలిచేది ఎవరన్నది చూడాలి.