Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. టీమిండియా క్రికెటర్ రివ్యూ ఇచ్చాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం.

By:  Tupaki Desk   |   20 March 2024 4:47 AM GMT
గుంటూరు కారం.. టీమిండియా క్రికెటర్ రివ్యూ ఇచ్చాడు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాకి థియేటర్స్ లో ఏవరేజ్ టాక్ వచ్చింది. అయితే ఓటీటీలో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని బాగానే ఆశ్వాదిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఓటీటీలోకి వచ్చిన తర్వాత మూవీ చాలా మందికి కనెక్ట్ అవుతోంది. ఇతర భాషలలో కూడా మూవీని ఆశ్వాదిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అయితే ఫుల్ ఫిదా అయిపోతున్నారు. శ్రీలీల డాన్స్ టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, డాన్స్ పైన కూడా బాగుందని మెచ్చుకుంటున్నారు.

ఇండియన్ స్టార్ క్రికెటర్, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాని తాను బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. ఈ మూవీలో సాంగ్స్ కి మహేష్ బాబు, శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారని అన్నాడు. మీరు చూడకపోతే యుట్యూబ్ లో గుంటూరు కారం సాంగ్స్ టైపు చేసి చూడండి. కచ్చితంగా నచ్చుతుంది అంటూ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కి సజిస్ట్ చేశారు.

రవిచంద్రన్ అశ్విన్ తమిళియన్ కావడంతో తెలుగు సినిమాలని కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాడు. ఇక్కడి స్టార్ హీరోలని కూడా అభిమానిస్తారు. అప్పుడప్పుడు తెలుగు క్రికెటర్స్ తో ముచ్చటించే సమయంలో సినిమాల గురించి ఎక్కువగా రవిచంద్రన్ అశ్విన్ డిస్కషన్ పెడుతూ ఉంటాడు. గతంలో హనుమ విహారితో మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి చర్చించిన వీడియో వైరల్ అయ్యింది.

మరోసారి గుంటూరు కారం సినిమాపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించడం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు వీడియోని ట్విట్టర్, పేస్ బుక్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఏవరేజ్ అయిన మూవీకి ఓటీటీలో ఆదరణ వస్తూ ఉండటం నిజంగా విశేషమని చెప్పాలి. గుంటూరు కారం మూవీ చూడదగిన మూవీ అని కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేశారని సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తోంది. ఏదో ఎక్స్ పెక్ట్ చేసుకొని వెళ్లడం వలన గుంటూరు కారం మూవీ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని కామెంట్స్ పెడుతున్నారు.