Begin typing your search above and press return to search.

ఓంకార్ అన్నయ్య తమ్ముడి మరో సినిమా

నేడు అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫ్రీ లుక్ కూడా రివీల్ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:34 AM GMT
ఓంకార్ అన్నయ్య తమ్ముడి మరో సినిమా
X

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల కు యాంకర్ గా సుపరిచితుడైన ఓంకార్ తన సోదరుడు అశ్విన్ బాబు ను హీరో గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అశ్విన్ అలరించాడు. ఆచి తూచి సినిమాలు చేస్తున్న అశ్విన్ బాబు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు దక్కించుకుంటున్నాడు.


ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిడింబ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ సినిమా త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సమయం లోనే అశ్విన్ బాబు కొత్త సినిమా ను ప్రకటించాడు. నేడు అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫ్రీ లుక్ కూడా రివీల్ చేయడం జరిగింది.

'వచ్చిన వాడు గౌతమ్' అనే విభిన్నమైన టైటిల్తో అశ్విన్ బాబు కొత్త సినిమా రాబోతుంది. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న అశ్విన్ బాబు ఈ కొత్త సినిమాతో మరోసారి ప్రేక్షకుల ను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది. మామిడాల ఎం.ఆర్ రామకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అశ్విన్ బాబు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కారణంగా ఆయన సినిమాలు మెల్లగా వస్తున్నాయి.