ఆదిపురుష్ ఇండస్ట్రీకి చాలా పాఠాలు నేర్పింది
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న డైరెక్టర్ అశ్విన్ కుమార్ రామాయణ గురించి మాట్లాడారు.
By: Tupaki Desk | 22 July 2025 6:00 PM ISTబాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. రీసెంట్ గా రామాయణ నుంచి వచ్చిన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటూ ఆ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా ఆ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవిగా సీతగా నటిస్తున్నారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ మలుపు తిప్పుతుందని డైరెక్టర్ అశ్విన్ కుమార్ అంటున్నారు. అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహావతార్: నరసింహ జులై 25న రిలీజ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఏడు సినిమాలు రానుండగా అందులో విష్ణుమూర్తి పది అవతారాలపై సినిమాలను నిర్మించనున్నారు. అందులో వస్తున్న మొదటి సినిమానే మహావతార్: నరసింహ.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న డైరెక్టర్ అశ్విన్ కుమార్ రామాయణ గురించి మాట్లాడారు. రామాయణం లాంటి గొప్ప కథలను ఎన్నిసార్లు తీసినా ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గానే చూస్తారని, గతంలో ఈ కథపై ఆదిపురుష్ వచ్చి ఫెయిలైందని, ఆ సినిమా విఫలమవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని, కానీ ఆదిపురుష్ తో మేకర్స్ ఏం చెప్పాలనుకున్నారనేది మాత్రం తనకు అర్థమైందని, ఆ సినిమా నుంచి ఇండస్ట్రీ ఎన్నో పాఠాలు నేర్చుకుందని ఆయన అన్నారు.
ఆదిపురుష్ ముగింపు కాదని, రామాయణం లాంటి కథతో ఎన్ని సార్లైనా సినిమాలు చేయొచ్చని అశ్విన్ కుమార్ అన్నారు. రామాయణ సినిమా ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేస్తుందనే నమ్మకం తనకుందని చెప్తున్న ఆయన, సినిమాకు బడ్జెట్ ఒక్కటే ముఖ్యం కాదని, కథను ఎలా చూపిస్తామనేదే కీలకమని ఆయన అన్నారు. మహావతార్: నరసింహ ముఖ్య ఉద్దేశం కూడా అదేనని, తన సినిమా ఆడియన్స్ కు చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని, పురాణాల కథలతో తీసే కథలకు మంచి డిమాండ్ ఏర్పడే రోజులు త్వరలోనే రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
