Begin typing your search above and press return to search.

బన్నీ ఆ సినిమాని తిరష్కరించినట్లే..!

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సదరు సినిమా కు నిర్మొహమాటంగా నో చెప్పేశాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:07 AM GMT
బన్నీ ఆ సినిమాని తిరష్కరించినట్లే..!
X

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ గా నిలిచాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమా తో ఉత్తరాదిన మరింత బలమైన ముద్ర ను వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపుగా 40 శాతం వరకు పూర్తి అయింది. త్వరలోనే మిగిలిన భాగం షూటింగ్ ను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే బన్నీ రెండు మూడు ప్రాజెక్ట్‌ లకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

కానీ బన్నీ ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగతో సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.

అల్లు అర్జున్‌ ఆ మధ్య 'అశ్వత్థామ' సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ తీసుకు వచ్చిన అశ్వత్థామ ను అల్లు అర్జున్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సదరు సినిమా కు నిర్మొహమాటంగా నో చెప్పేశాడని తెలుస్తోంది.

నిన్న మొన్నటి వరకు అశ్వత్థామ విషయంలో డైలమాలో ఉన్న అల్లు అర్జున్‌ తాజాగా క్లారిటీగా ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి అశ్వత్థామ సినిమా ను చేయలేను అంటూ తేల్చి చెప్పాడట. అల్లు అర్జున్‌ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని దీన్ని బట్టి అర్థం అవుతుంది.