Begin typing your search above and press return to search.

థై స్లిట్ ఫ్రాక్ లో అషు కొంటె ఫోజులు

ఆషు రెడ్డి - బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా వినియోగదారులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:23 AM GMT
థై స్లిట్ ఫ్రాక్ లో అషు కొంటె ఫోజులు
X

ఆషు రెడ్డి - బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా వినియోగదారులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆషూ.. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇంత‌కుముందు టిక్‌టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో బిగ్ బాస్ 3 ఆఫర్‌ను పొందింది.


ఇటీవలి కాలంలో, ఆమె హాట్ ఫోటోల కోసం పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆషూ 'ఎ మాస్టర్‌పీస్‌'లో యువ హీరో అరవింద్‌ కృష్ణ సరసన కథానాయికగా న‌టించింది. ఆధ్య పాత్రలో అషు రెడ్డి న‌టించింది. దీనికి సుకు పూర్వజ్ ద‌ర్శ‌కుడు. నితిన్ హీరోగా నటించిన 'ఛల్ మోహన్ రంగ'తో అషు రెడ్డి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె బిగ్ బాస్ - సీజన్ 3 లో కంటెస్టెంట్‌లలో ఒకరిగా పాల్గొంది. ఇటీవలి కాలంలో రామ్ గోపాల్ వర్మతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ద్వారా మరింత పాపులర్ అయ్యింది.


వీట‌న్నిటినీ మించి అషు రెడ్డి సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అషు స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని ఊపేస్తోంది. ప‌సుపు రంగు థై స్లిట్ ఫ్రాక్ లో అషు కొంటె ఫోజులు ఇప్ప‌టికే కుర్ర‌కారు గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఈ లుక్ లో అషు ఎంతో వేడిగా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అషు థై స్లిట్ ఎలివేష‌న్.. గ్లామ‌ర్ ట్రీట్ లో త‌గ్గేదేలే అంటూ చెల‌రేగ‌పోవ‌డంపైనా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగింది. ఏం చేసినా అది క‌చ్ఛితంగా స‌రైన అవ‌కాశాల్ని సృష్టించుకునేందుకే. అషు కాంపిటీష‌న్ ని ఎదుర్కొనేందుకు ఇలా స్పెష‌ల్ ఫోటోషూట్ల‌తో దూసుకొస్తోంది. తాజా ఫోటోషూట్ కి నిండైన చంద‌మామ‌లా జీవించాలంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది ఈ బ్యూటీ.