Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్సులో అషు పాప.. కిల్లర్ లుక్స్

రీసెంట్ గా రెడ్ కలర్ డ్రెస్సులో లెగ్స్ అందాలు మరింత వైరల్ అయ్యే విధంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   2 March 2024 11:52 AM GMT
పొట్టి డ్రెస్సులో అషు పాప.. కిల్లర్ లుక్స్
X

సోషల్ మీడియాలో మొదట మంచి క్రేజ్ అందుకున్న అషు రెడ్డి ఆ తర్వాత వరుస ఇంటర్వ్యూలతో కూడా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అమ్మడు ఆర్జీవి తో చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవి అమ్మడి చేతిలో చెంపదెబ్బ కూడా తిన్నాడు. ఆ తర్వాత ఆమెకు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అనంతరం బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ అందాలతో కూడా కూడా అమ్మడు వైరల్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా మరోసారి ఊహించని తరహాలో అందంగా దర్శనమిచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అందంతో ఉనికిని చాటుకునే ఈ బ్యూటీ ఫాలోవర్స్ సంఖ్యను గట్టిగానే పెంచుకుంటుంది.

ఇక ఘాటైన సొగసులతో ఫోటోలకు పోజులు ఇవ్వడంలో కూడా అమ్మడి స్టైలే వేరు అని చెప్పవచ్చు. రీసెంట్ గా రెడ్ కలర్ డ్రెస్సులో లెగ్స్ అందాలు మరింత వైరల్ అయ్యే విధంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. గతంలో ఇంతకంటే ఘాటైన డ్రెస్లలో కూడా కనిపించిన అషు రెడ్డి ఇప్పుడు మాత్రం మరింత అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

అంతేకాకుండా ఈ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసిన కూడా చాలా అందంగా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇక సినిమాలలో అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి ఎప్పుడు చలాకీగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని రియాలిటీ షోలలో కూడా కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో అమ్మడు మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ తో కొంతమంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ కనిపించింది. అనంతరం కొన్ని మీడియం రేంజ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది. అయితే ఆ పాత్రలు మాత్రం ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విధంగా తన గ్లామర్ తో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మంచి గ్లామరస్ క్యారెక్టర్స్ వస్తే చేయడానికి సిద్ధమే అని అమ్మడు ఈ విధంగా చెప్పకనే చెబుతోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు ఏవైనా కొత్త అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.