Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స‌ర్ నాకు వార్నింగ్ ఇచ్చారు

తెలుగు ప్రేక్ష‌కుల‌కు అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ గా అషు రెడ్డి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   8 April 2025 5:00 AM IST
Ashu Reddy’s Special Bond with Pawan Kalyan
X

తెలుగు ప్రేక్ష‌కుల‌కు అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ గా అషు రెడ్డి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్లు చేసే అషు రెడ్డి బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక త‌న క్రేజ్ మ‌రింత పెరిగింది. అయితే అషు రెడ్డికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంతో ఇష్ట‌మ‌నే సంగ‌తి అంద‌రికీ తెలుసు.

ప‌వ‌న్ ను ఎంతో అభిమానించే అషు అత‌ని పేరుని ఆమె ఒంటిపై టాటూ కూడా వేయించుకుంది. ఇదిలా ఉంటే అషు రెడ్డి రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ ను క‌లిసిన‌ప్పుడు జ‌రిగిన విష‌యాల‌ను గుర్తు చేసుకుంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌క్క సెట్ లోనే త‌న హ్యాపీ డేస్ షూటింగ్ జ‌రుగుతుంద‌ని, విష‌యం తెలిసి ఆయ‌న్ని ఎలా అయినా క‌ల‌వాల‌నుకుని ఎప్పుడెప్పుడు షూటింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు క‌లుద్దామా, అస‌లు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకూడ‌దని దేవుడికి దండం కూడా పెట్టుకున్న‌ట్టు అషు తెలిపింది.

మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ప‌వ‌న్ ను క‌ల‌వ‌డానికి వెళ్లాన‌ని, ప‌క్క సెట్ నుంచి మేం వ‌చ్చామ‌ని తెలిసి ప‌వ‌న్ ర‌మ్మ‌న్నార‌ని, న‌న్ను చూసి నువ్వేనా నా పేరు టాటూ వేయించుకుంది అని ప‌వ‌న్ అడ‌గటంతో ఆయ‌న‌కు నేను గుర్తున్నానా అని షాక‌య్యాన‌ని చెప్పిన అషు, త‌మ‌ను కూర్చోపెట్టి టీ ఇచ్చార‌ని, ఆయ‌న టీ తాగుతుంటే తాను మాత్రం టీను ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆయ‌న్నే చూశాన‌ని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఆయ‌న టీ తాగుతుండ‌గా స‌ర్ మీరు ఖుషి మూవీలో భూమిక న‌డుము చూడ‌టం నాకు నచ్చ‌లేదు అని చెప్ప‌గానే ప‌వ‌న్ ప‌డీ ప‌డీ న‌వ్వార‌ని, ఆయ‌న చేతిపై ఉన్న టాటూని చూస్తాన‌ని చెప్తూ ప‌వ‌న్ చేతిని ప‌ట్టుకున్నాన‌ని, ఓ రకంగా చెప్పాలంటే ఆయ‌న్ని తాను ఫ్ల‌ర్ట్ చేశాన‌ని, ఆయ‌న టీ తాగిన గ్లాస్ ను దాచుకోవ‌డానికి అడిగితే ఫోటోలు, గిఫ్లులు కాదు, మ‌నం ఎవ‌రినైనా క‌లిస్తే వారితో గ‌డిపిన క్ష‌ణాల్ని గుర్తుపెట్టుకుంటే బావుంటుంద‌ని చెప్పార‌ని అషు తెలిపింది.

ఆ రోజు ఆయ‌న‌తో క‌లిసి రెండు గంట‌లు టైమ్ స్పెండ్ చేశాన‌ని చెప్తున్న అషు తాను స‌క్సెస్ అవాల‌ని ఆల్ ది బెస్ట్ చెప్తూ ప‌వ‌న్ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చార‌ని చెప్పింది. అంతేకాదు, తాము తిరిగి వ‌చ్చేట‌ప్పుడు ప్ర‌తీసారీ నేను ఈ మూడ్ లో ఉండ‌ను, ఈ సారి క‌లిసేట‌ప్పుడు జాగ్ర‌త్త అని ప‌వ‌న్ స‌ర‌దాగా వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్టు అషు తెలిపింది.