Begin typing your search above and press return to search.

మీడియావారి ప్రశంశలు అందుకున్న "అష్టదిగ్బంధనం"

ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈసందర్భంగా అష్టదిగ్బంధనం సినిమా ప్రీమియర్ షోని చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖులకు, మీడియా వారికి ప్రదర్శించారు.

By:  Tupaki Desk   |   22 Sept 2023 3:23 PM
మీడియావారి ప్రశంశలు అందుకున్న అష్టదిగ్బంధనం
X

బాబా పి.ఆర్ దర్శకత్వంలో సూర్య, విషిక జంటగా నటించిన తాజా చిత్రం "అష్టదిగ్బంధనం".

ఎం.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రరడక్షన్ పై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈసందర్భంగా అష్టదిగ్బంధనం సినిమా ప్రీమియర్ షోని చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖులకు, మీడియా వారికి ప్రదర్శించారు.

చిత్రాన్ని వీక్షించిన సినీ ప్రమ ఖులు, మీడియా వారు "డైరెక్టర్ బాబా పి.ఆర్ పకడ్బందీ స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని గ్రిప్పింగ్ గా మలిచారు, కొత్త ఆర్టిస్టు లతో మంచి నటనను రాబట్టుకున్నారు, సినిమాలో ట్విస్టులు ఆకట్టుకున్నాయి, ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడం హర్షించదగ్గ విషయం, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి అష్టదిగ్బంధనం మస్ట్ వాచ్ మూవీ" అని పేర్కొన్నారు.