Begin typing your search above and press return to search.

దేవకీ నందన వాసుదేవ టీజర్.. ఎలా ఉందంటే..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. మూవీ టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ని భాగానే ఆవిష్కరించారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 12:01 PM GMT
దేవకీ నందన వాసుదేవ టీజర్.. ఎలా ఉందంటే..
X

గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే నటనతో మెప్పించి పరవాలేదనిపించుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆ మూవీ వచ్చింది. సెకండ్ మూవీ కోసం ఏడాది పాటు వెయిట్ చేశాడు. తాజాగా అతని రెండో చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది.

ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. మూవీ టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ని భాగానే ఆవిష్కరించారు. ఇక ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ ఖరారు చేశారు. టీజర్ ఆరంభంలోనే నీ బిడ్డకి మరణం ఘండం లేదా అతని చేతిలో మరొకరికి మరణం అనే డైలాగ్ తో టీజర్ ఓపెన్ చేశారు.

తరువాత యాక్షన్ సీక్వెన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ హీరోయిన్ నిపరిచయం చేశాడు. యుగామేధైన, ధర్మమేదైనా ఈ భూమి మీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు. వాడిని చంపడానికి దేవుడు పుడతాడు. అనే డైలాగ్ తో విలన్ లి ఎలివేట్ చేసి యాక్షన్ సీక్వెన్స్ తో కంటెంట్ ని నడిపించారు. కథ బ్యాక్ డ్రాప్ లో హరేకృష్ణ అనే మంత్రాన్ని పవర్ ఫుల్ బీజీఎం తో ఆవిష్కరించి కథని చూచాయగా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు.

ఈ చిత్రంతో తెలుగమ్మాయి మానస వారణాసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ బ్యూటీ మిస్ ఇండియా 2020 అందాల పోటీల్లో టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇక హీరో తల్లిగా దేవయాని కనిపిస్తోంది. భీమ్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమాతో ఎన్నారై డిస్టిబ్యూటర్ ఎస్ బాలకృష్ణ నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.

లలితాంబిక ప్రొడక్షన్స్ లో మొదటి చిత్రంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. కాస్తా కృష్ణా టచ్ ఉండటంతో ఈ మూవీ కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం.