ఫోటో అడిగితే తమన్నానే ఇచ్చేసారు!
తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు అశోక్ తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు.
By: Tupaki Desk | 16 April 2025 6:42 AMమిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న చిత్రం `ఓదెల2`. ఆథ్యాత్మికం..హారర్ అంశాలు ఆధారంగా అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఆహార్యం....నటన ప్రేక్షకుల మరో అమ్మోరు, అరుంధని గుర్తు చేస్తున్నాయి. లేడీ ఓరియేంటెడ్ లో ఈ తరహా చిత్రం వచ్చి చాలా కాలమవుతోంది.
దీంతో తమన్నా ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. హిందు దేశంలో ఇలాంటి సినిమాల అవసరం ఎంతైనా ఉందని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు అశోక్ తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. అదేంటో ఆయన మాటల్లోనే... `సిటీ మార్` చిత్రీకరణ సమయంలో తమన్నాతో ఫోటో కావాలని సంపత్ నందిని అడిగాను.
అప్పుడే ఆయన ఫోటో కాదు సినిమానే ఇస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం ఏకంగా తమన్నానే నాకు ఇచ్చేసారు. ఓదెల 2 ద్వారా తమన్నాని డైరెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అందుకు సంపత్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. వినూత్నమైన విజువల్స్ సినిమాలో ఉంటాయన్నారు. తమన్నా ఇంత వరకూ ఈ తరహా లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేయలేదు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో అలరించింది.
కానీ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రం మెయిన్ లీడ్ పోషించడం ఇదే తొలిసారి.ఈ సినిమా సక్సెస్ అయితే తమన్నాకు మంచి పేరొస్తుంది. అరుంధతిలో అనుష్కలో...అమ్మోరులో సౌందర్యలా ఫేమస్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద సోలో నాయికగానూ సత్తా చాటిన నటిగానూ ప్రూవ్ అవుతుంది.