Begin typing your search above and press return to search.

వీసా టీజర్: అమెరికాలో సరదా ప్రేమ కథ!

ఘట్టమనేని మనవడు గల్లా అశోక్‌ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   12 July 2025 11:47 AM IST
వీసా టీజర్: అమెరికాలో సరదా ప్రేమ కథ!
X

ఘట్టమనేని మనవడు గల్లా అశోక్‌ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా పేరు వీసా - వింటారా సరదాగా. టైటిల్ నుంచే కాస్త క్యూట్‌గా, ఫన్‌గా అనిపిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల కాగా, యూత్‌లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. టీజర్ చూసిన వెంటనే ఇది పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతరం జీవితాల్లో వచ్చే మలుపులు, కష్టాలు, ప్రేమలు, బ్రేక్ అప్‌లు అన్నీ ఇందులో ఉన్నట్లు టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు.

దర్శకుడు ఉద్భవ్ తన తొలి సినిమాతోనే కంటెంట్‌ను కనెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. టీజర్‌లో చూపించిన అమెరికన్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫన్నీ డైలాగులు, ఫన్ మోమెంట్స్, లవ్ అన్నీ కలగలిసిన టోన్‌తో ఈ టీజర్‌ను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. "ఆంద్ర తెలంగాణ తరువాత మన తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అయిన స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్?" అనే డైలాగ్ తో హీరో పోడ్ క్యాస్ట్ చెబుతుండడం హైలెట్ అయ్యింది. చాలా మంది ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్స్ కు ఇది దగ్గరగా ఉంది. ఇది ప్రేక్షకులను సినిమాకు మరింతగా ఆకర్షించేలా ఉంది.

ఇక బ్యాచిలర్ రూమ్స్ లో పదిమందిగా పైగా ఉండడం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు అలాగే హీరో హీరోయిన్ ప్రేమ కథ సినిమాలో హైలెట్ గా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇక టీజర్‌లో హీరో గల్లా అశోక్ లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత సినిమాతో పోలిస్తే మంచి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. శ్రీ గౌరీ ప్రియా గ్లామర్‌ విత్ గ్రేస్ కింద ఆకట్టుకుంది.

టీజర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది విజయ్ బుల్గానిన్ అందించిన బీజీఎమ్. అదనంగా, శివాత్మిక, రాహుల్ విజయ్, హర్ష చెముడు వంటివారు కూడా తమ పాత్రలతో టీజర్‌ను కాస్త కలర్‌ఫుల్‌గా, యూత్‌ఫుల్‌గా మార్చారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యల ప్రొడక్షన్ విలువలు స్పష్టంగా టీజర్‌లో కనిపిస్తున్నాయి.

టేకింగ్ పరంగా, ప్రొడక్షన్ స్టాండర్డ్స్ పరంగా ఇది ఓ బౌండరీ దాటే ప్రయత్నంగా అనిపిస్తోంది. టీజర్ టాక్ చూస్తే ‘వీసా - వింటారా సరదాగా’ సినిమా పూర్తిగా యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో చదువు పేరుతో వెళ్లిన యువతరం అనుభవాలను ఎమోషనల్ టచ్‌తో చూపించే యత్నం ఇందులో కనిపిస్తోంది. టీజర్‌నే ఇంత ఇంటెన్స్‌గా కట్ చేస్తే, సినిమా ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటనకు ముందు ఈ టీజర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఇక రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.