Begin typing your search above and press return to search.

రాయల్ లుక్ లో కొత్త జంట.. రిసెప్షన్ కు రెడీ!

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Feb 2024 2:12 PM GMT
రాయల్ లుక్ లో కొత్త జంట.. రిసెప్షన్ కు రెడీ!
X

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేసిన ఆశిష్ రెడ్డి.. తనకు సరిజోడీ అయిన అద్వైత మెడలో మూడుముళ్లు వేశారు. వీరి పెళ్లి రాజస్థాన్ జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో సన్నిహితులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది.

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రేమికుల రోజునే తన లైఫ్ లో మెమోరబుల్ మూమెంట్ గా మార్చుకున్నారు ఆశిష్ రెడ్డి. అంతకుముందు రోజు సాయంత్రం ప్యాలెస్ లో గ్రాండ్ గా సంగీత్ నిర్వహించారు. అద్వైతతో ఆశిష్ డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ఇక దిల్ రాజు జోష్ అయితే వేరే లెవల్. తన మనవరాలితో ఓ రేంజ్ లో సందడి చేశారు.

లేటెస్ట్ గా కొత్త జంట ఆశిష్- అద్వైత.. ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో తమ పిక్ ను షేర్ చేశారు. ఇద్దరూ రాయల్ ఔట్ ఫిట్ లో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. న్యూ కపుల్ కు నెటిజన్లు, అభిమానులు విషెస్ చెబుతూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అద్వైత.. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది.

ఇక ఫిబ్రవరి 20వ తేదీన ఆశిష్ రెడ్డి.. హైదరాబాద్ లో తన మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఆశిష్ తోపాటు దిల్ రాజు పలువురి నివాసాలకు వెళ్లి మరీ ఆహ్వానించారు. అయితే ఆశిష్ వివాహ సంబంధం విషయంలో లెక్కల మాస్టర్ సుకుమార్.. మధ్యవర్తిగా వ్యవహరించారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సినిమాల విషయానికొస్తే.. రౌడీ బాయ్స్ మూవీతో ఆశిష్ రెడ్డి హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. తన అంకుల్ దిల్ రాజే ఈ మూవీని నిర్మించారు. మలయాళీ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన ఆశిష్.. ఇప్పుడు సెల్ఫీష్ మూవీ చేస్తున్నారు. ఇందులో లవ్ టుడే భామ ఇవానా ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. కసి విశాల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ.. 2024లోనే విడుదల కానున్నట్లు సమాచారం.