Begin typing your search above and press return to search.

భయపెట్టే కథలో రాజుగారి అబ్బాయి

'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన కుర్రాడు ఆశిష్ రెడ్డి

By:  Tupaki Desk   |   21 Aug 2023 8:48 AM GMT
భయపెట్టే కథలో రాజుగారి అబ్బాయి
X

'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన కుర్రాడు ఆశిష్ రెడ్డి. ఇప్పుడతను మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం 'సెల్ఫిష్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చివరి దశకు చేరుకోవడంతో అప్పుడే ఆయన తన మూడో చిత్రాన్ని గ్రాండ్​గా ప్రారంభించారు.

హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. నిర్మాతలు చిన్నబాబు, నాగవంశీ సహా పలువురు కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్​ గ్రహీత ఎమ్‌. కీరవాణి సంగీతం అందించడం విశేషం. సినిమాటోగ్రాఫర్​గా పీశి శ్రీరామ్ వ్యవహరించనున్నారు. ఇంకా అవినాష్‌ కొల్లా సహా పలువురు స్టార్‌ టెక్నికల్‌ టీమ్‌ అంతా ఈ సినిమా కోసం పనిచేయనుంది.

హార్రర్ లవ్​ జానర్‌లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు అరుణ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌గా, సరికొత్త కాన్సెప్ట్‌తో రానుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని తెలిసింది.

ఇకపోతే టాలీవుడ్‌ అగ్ర నిర్మాత శిరీష్‌ కొడుకు ఆశిష్‌ రెడ్డి. అతడి మొదటి సినిమా రౌడీ బాయ్స్‌ కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయినా ఆశిష్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అతడు సెల్ఫిష్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు విశాల్‌ కాశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాను ఎంతో నేచురాలిటీగా రియల్ లొకేషన్స్​లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆశిష్​ గల్లీ కుర్రాడిగా నటిస్తుండగా.. ఇవానా ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ ఉద్యోగిగా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, సాంగ్స్​ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. లవ్‌టుడే ముద్దుగుమ్మ ఇవాన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సుకుమార్​ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.