Begin typing your search above and press return to search.

ట్రైలర్.. దెయ్యంతో డేరింగ్ లవ్

కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అనుబంధ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

By:  Tupaki Desk   |   16 May 2024 12:36 PM GMT
ట్రైలర్.. దెయ్యంతో డేరింగ్ లవ్
X

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమా లవ్ మీ. హారర్ లవ్ జానర్ లో సరికొత్తగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అనుబంధ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. లవ్ మీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఏదైనా చేయొద్దు అంటే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసే హీరోగా అర్జున్ అనే క్యారెక్టర్ లో ఆశిష్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు.

ఎనిమిది దాటితే ఒక అల్లారం మోగుతుంది. ఇక తర్వాత ఒక ఒక అమ్మాయి ఒక బంగ్లా వైపు తిరిగి చూడడంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక హీరో అర్జున్ అదే బంగ్లాలోకి వెళ్లాలని అనుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దెయ్యం గురించి ఎన్నో విషయాలు అతనికి తెలుస్తాయి. ఆ దెయ్యం ఇప్పటికే చాలామందిని చంపేసింది అని నిన్ను కూడా చంపేస్తుంది అనే అతని స్నేహితులు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడు.

ఎప్పటికైనా తను లైక్ చేస్తుంది అన్నట్లుగా మాట్లాడడంతో అతని క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దెయ్యంతో లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి ట్రైలర్ అయితే కొన్ని విజువల్స్ తో అలాగే డిఫరెంట్ సీన్స్ తో చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను గత వారమే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మళ్లీ వాయిదా వేశారు. మే 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అఫీషియల్ గా మరోసారి క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా వచ్చిన మరొక టాక్ ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ నిర్వహిస్తూ ఉండడంతో బహుశా ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేయవచ్చు అనేలా కొన్ని గాసిప్స్ గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను అనుకున్న టైమ్ కి విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.