Begin typing your search above and press return to search.

ఆషిష్ `దేత్త‌డి` ఫ‌స్ట్ లుక్‌..మాసీవ్ అండ్ ఇంట్రెస్టింగ్‌

స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్‌ దిల్ రాజు, శిరీష్ త‌మ‌శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తున్న 60వ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   1 May 2025 11:25 AM IST
Ashish Dethadi First Look
X

స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్‌ దిల్ రాజు, శిరీష్ త‌మ‌శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తున్న 60వ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు. త‌మ వార‌సుడు ఆశిష్ హీరోగా అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు. రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మైన ఆశిష్ త‌రువాత `ల‌వ్ మీ` పేరుతో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌డం, అది ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోవ‌డం తెలిసిందే. దీంతో కొంత విరామం తీసుకున్న ఆశిష్ సరికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌నే ఉద్దేశ్యంతో కొత్త క‌థ‌ను ఎంచుకున్నాడు.


వెర్స‌టైల్ క్యారెక్ట‌ర్ల‌తో హీరోగా త‌నకంటూ ప్ర‌త్యేత‌ను చాటుకోవాలని తొలి సినిమా నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆశిష్ తాజాగా మ‌న క‌ల్చ‌ర్‌ని రిప్ర‌జెంట్ చేసే క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి ఆదిత్య రావు గంగ‌సాని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఇందులో ఆశిష్ అత్యంత స‌హ‌జ‌త్వంతో సాగే స్ట్రీట్ డ్ర‌మ్మ‌ర్‌గా నేటీవిటీకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. ఆశిష్ మూడ‌వ ప్రాజెక్ట్‌గా తెర‌పైకి వ‌స్తున‌క్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఆశిష్‌ని హీరోగా, న‌టుడిగా నిల‌బెట్టే రూటెడ్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్‌ని మేక‌ర్స్ గురువారం విడుద‌ల చేశారు. హీరో ఆశిష్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌ని విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి `దేత్త‌డి` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. ఇక ఫ‌స్ట్ లుక్‌లో హీరో ఆశిష్ టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే మాసీవ్ క్యారెక్ట‌ర్‌లో స్ట్రీట్ డ్ర‌మ్మ‌ర్‌గా క‌నిపించ‌డంఅంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ఆశిష్ మాసీవ్ లుక్‌లో డ్ర‌మ్మ‌ర్‌గా క‌నిపిస్తున్న తీరు ప్రాజెక్ట్‌పై అంద‌రిలోనే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టైటిల్‌తో పాటు క్యాప్ష‌న్ కూడా ఇంట్రెస్ట్‌ని క్రిమ‌యేట్ చేస్తోంది. `గాడ్ ఫ‌టీతో ఫ‌టీ మ‌గ‌ర్ న‌వాబి నా ఘ‌టీ` అనే క్యాప్ష‌న్‌ని చూస్తుంటే ఈ సారి ఆశిష్ ప‌క్కా రూటెడ్ స్టోరీతో రా కంటెంట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంతే కాకుండా ఆశిష్ క్యారెక్ట‌ర్ ఫ‌స్ట్ లుక్, క్యాప్ష‌న్‌ని బ‌ట్టి ఈ మూవీ ప‌క్కా తెలంగాణ స్లాంగ్‌తో సాగుతుంద‌ని తెలుస్తోంది. తెలంగాణ నేప‌థ్య క‌థ‌ల‌తో విజ‌యాలు అందుకుంటున్న దిల్ రాజు మ‌రో సారి అదే స్లాంగ్‌ని, అదే నేప‌థ్యాన్ని ఆశిష్ కోసం ఎంచుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇండియ‌న్ సినిమాల్లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని నేప‌థ్యంలో రానున్న ఈ మూవీ ఆశిష్‌కు హీరోగా స‌రికొత్త ఇమేజ్‌ని అందించ‌డం ఖాయం అని మేక‌ర్స్ భావిస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో విభిన్న‌మైన క‌థ‌గా రూపొంద‌నున్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.