Begin typing your search above and press return to search.

చిరుతో ఆషీకా..మెగా అభిమానుల‌ ఆశ‌లు ఆవిరి!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 156వ చిత్రం `విశ్వంభ‌ర` శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2024 5:30 AM GMT
చిరుతో ఆషీకా..మెగా అభిమానుల‌ ఆశ‌లు ఆవిరి!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 156వ చిత్రం `విశ్వంభ‌ర` శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా త్రిష న‌టిస్తోంది. ఇద్ద‌రు క‌లిసి 18 ఏళ్ల త‌ర్వాత తెర‌ను పంచుకోవ‌డంతో ఆ పెయిర్ ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంత‌కంత‌కు పెరిగిపోతుంది. అలాగే సినిమాలో అన్నా-చెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుంద‌ని లీకుంలందుకున్నాయి. ఏకంగా చిరుకి ఐదురుగు చెల్లెళ్లు ఉంటార‌ని ప్ర‌చారం సాగుతుంది.


ఈ నేప‌థ్యంలో సెటిమెంట్ అంశాల‌తో సినిమాని హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా చిరుకి జోడీగా మ‌రో అంద‌మైన న‌టి ఆషీకా రంగ‌నాధ్ ని సెకెండ్ లీడ్ కి ఎంపిక చేసిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగుతోంది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంద‌ని ప్ర‌చారం వెడెక్కిస్తోంది. దీంతో చిరు ఇద్దరు భామ‌ల స‌ర‌స‌న ముద్దుల ప్రియుడిగాను క‌నిపిస్తారా? అనే చ‌ర్చ మొద‌లైంది. చిరు యంగ్ లుక్ కూడా అంతే హైప్ తీసుకొచ్చింది.

హెయిర్ స్టైల్ మారింది. మ‌నుపటి కంటే హ్యాండ్ స‌మ్ లుక్ లోకి మారారు. ఇలా ర‌క‌ర‌కాల మార్పుల‌తో చిరంజీవి నేటి జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌కు ప‌ర్పెక్ట్ మ్యాచ్ గా హైలైట్ అవ్వ‌డంతో ఆషీకాతోనూ సాంగేసుకుంటార‌ని అంతా భావిస్తు న్నాయి. అయితే తాజాగా ఆషీకా రంగ‌నాధ్ త‌న పాత్ర‌పై క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో చిరు సార్ కి జోడీగా న‌టించ‌డం లేద‌ని..కేవ‌లం ఓ కీల‌క పాత్ర‌మే పోషిస్తున్నాన‌ని, సినిమా ముగింపు వ‌ర‌కూ ఆ పాత్ర కొన‌సాగింపు ఉంటుంద‌ని` తెలిపింది.

మొత్తానికి అమ్మ‌డు మెగా అభిమానుల‌నైతే నిరుత్సాహ‌ప‌రిచింది. త్రిష‌తో పాటు ఆషీకా కూడా చిరుతో రొమాన్స్ చేస్తే అది వేరే లెవ‌ల్లో ఉండేది? కానీ ఆ పాత్ర‌ని కొంత‌వ‌ర‌కూ వశిష్ట ప‌రిమితం చేసాడు. జూన్ క‌ల్లా చిరంజీవి పోర్ష‌న్ షూటింగ్ కూడా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. అదే నెల‌లో చిరు కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.