Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ సీనియర్ లీగ్‌కేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది కన్నడ భామ ఆషికా రంగనాథ్

By:  Tupaki Desk   |   24 May 2024 7:28 AM GMT
ఈ హీరోయిన్ సీనియర్ లీగ్‌కేనా?
X

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కన్నడ భామ ఆషికా రంగనాథ్. ఐతే ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో తనను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సరసన నటించిన ‘నా సామిరంగ’ ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించడంతో ఆషికా అందరి దృష్టిలో పడింది. ఈ సినిమాలో కంటెంట్ యావరేజ్ అయినప్పటికీ.. బాగా ఆడడంలో హీరోయిన్‌గా ఆషికా పాత్ర కీలకం. తన అందచందాలు, నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. ఆ సినిమాలో ఆషికాను చూసి తెలుగులో బిజీ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లే ఆషికా మరో పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకుంది.

మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’లో ఓ కథానాయికగా ఆషికాను కన్ఫమ్ చేశారు. ఈ చిత్రంలో ఇంకో ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఆషికా తన ప్రత్యేకతను చాటుకోగలదనే అంచనా వేస్తున్నారు. ఐతే నాగార్జునతో నటించాక ఆయనకంటే సీనియర్ అయిన చిరు పక్కన హీరోయిన్‌గా చేస్తుండడంతో ఆషికా సీనియర్ లీగ్‌కే పరిమితం అయిపోతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. వరుసగా ఇద్దరు సీనియర్ హీరోల పక్కన నటిస్తే.. ఆ లీగ్‌కే పరిమితం చేసేస్తారు. ఆ తర్వాత యంగ్ హీరోల సరసన ఛాన్సులు రావడం కష్టమవుతుంది. ఐతే మెగాస్టార్ సినిమా అంటే ఇవేవీ ఆలోచించకుండా ఏ హీరోయిన్ అయినా ఓకే అనేస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి భారీ మూవీలో నటించాక ఆషికా రేంజ్ మరిచిపోతుందనడంలో సందేహం లేదు.