Begin typing your search above and press return to search.

అమ్మడి అతి జాగ్రత్త కొంపముంచేలా ఉందే..!

కన్నడలో రెండు సినిమాలు చేస్తున్న ఆషిక తెలుగులో వస్తున్న అవకాశాలను హోల్డ్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   8 April 2024 4:30 PM GMT
అమ్మడి అతి జాగ్రత్త కొంపముంచేలా ఉందే..!
X

కన్నడలో ఇప్పటికే పాపులర్ అయిన ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రామ్ అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆషిక గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే అమిగోస్ లో ఆషికని చూసి నా సామిరంగ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. విజయ్ బిన్ని డైరెక్షన్ లో నాగ్ హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమాతో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.

ఆ సినిమాలో ఆషిక ని చూసిన తెలుగు ఆడియన్స్ ఇన్నాళ్లు ఎక్కడ దాచారు ఈ అందాల ముద్దుగుమ్మని అనేలా చేశారు. నా సామిరంగ హిట్ లో ఆషిక గ్లామర్, యాక్టింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆషిక వరుస అవకాశాలు అందుకుంటుందని అనుకోగా ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు.

కన్నడలో రెండు సినిమాలు చేస్తున్న ఆషిక తెలుగులో వస్తున్న అవకాశాలను హోల్డ్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. నా సామిరంగతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో కథల విషయంలో మరీ పట్టింపులు చూపిస్తుందట ఆషిక. స్టార్స్ మాత్రమే కాదు యువ హీరోలతో కూడా నటించేందుకు సిద్ధమే అనేస్తున్న ఆషిక స్టోరీ, క్యారెక్టరైజేషన్ ల గురించి చాలా సీరియస్ గా ఉందట.

రెమ్యునరేషన్ కూడా అంతగా డిమాండ్ చేయని ఆషిక కథల విషయంలో మాత్రం రాజీ పడట్లేదని తెలుస్తుంది. అయితే మరీ లేట్ చేసినా సరే వచ్చిన క్రేజ్ మిస్ యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. వేడి మీద ఉన్నప్పుడే అవకాశాలు అంది పుచ్చుకోవాలి కానీ ఆషిక అతి జాగ్రత్త వల్ల చేతిదాకా వచ్చిన సినిమాలు వెళ్లిపోతున్నాయని తెలుస్తుంది. ఆషిక అతి జాగ్రత్త ఆమె కొంపముంచేలా ఉందని అంటున్నారు.

ఆషిక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో ఆషిక నటిస్తుందని లేటెస్ట్ టాక్. అదేకాదు మరో స్టార్ సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుందట. నాగార్జున కూడా మళ్లీ ఆషికతో జత కట్టాలని ప్లాన్ చేస్తున్నారట. సో ఈ సినిమాలన్నీ కుదిరితే ఆషిక కూడా టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ స్టార్ గా ఎదగడం పక్కా అని చెప్పొచ్చు. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా ఆషిక తన ఆలస్యాన్ని అమృతంగా మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.