Begin typing your search above and press return to search.

శారీలో ఆషిక మాయ

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jun 2024 2:40 PM GMT
శారీలో ఆషిక మాయ
X

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే తన అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఎన్నో రాత్రులు సాంగ్ లో తన డ్యాన్స్ అండ్ గ్లామర్ షోతో అలరించింది ఆషిక. అమ్మడు అందానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఆకట్టుకోలేకపోయినా.. ఆషికకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.


ఆ తర్వాత నాగార్జున నా సామిరంగా చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆషిక. ఈ సినిమాలో వరలక్ష్మి రోల్ లో కనిపించింది. నాగార్జున సరసన తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. టాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అభిమానులను కూడా పెంచుకుంది. ఇప్పుడు తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో ఉన్న ఆషిక.. షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది.


అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఆషిక రంగనాథ్. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ తో పలకరిస్తుంటుంది. గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తుంటుంది. మితిమీరిన గ్లామర్ షో లేకుండా క్యూట్ గా ఉండే పిక్స్ ను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. శారీలతో పాటు మోడ్రన్ డ్రెస్సులో పోజులు ఇస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా ఆషిక రంగనాథ్ మరోసారి ప్లెయిన్ శారీలో మెరిసింది.


స్లీవ్ లెస్ బ్లౌజ్, డబుల్ షేడ్ కలర్ శారీలో దిగిన పిక్స్ ను షేర్ చేసింది ఆషిక. వయ్యారంగా అందాలు ఆరబోసింది. సోఫాలో కూర్చుని పోజులిస్తూ ఫిదా చేసింది. ఓ ఫోటోలో ఎద అందాలతో కవ్వించింది. మరో పిక్ లో నడుమును ఇన్ డైరెక్ట్ గా చూపిస్తూ మాయ చేసింది. మొత్తానికి ఆషిక కొత్త పిక్స్ వేరే లెవల్ లో ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సింపుల్ మేకప్, సూపర్ ఫేస్ టోన్ తో ఆషిక సింప్లీ సూపర్బ్ గా ఉన్నారని చెబుతున్నారు.


ఇక ఆషిక అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో అనేక మంది హీరోయిన్లు నటిస్తుండగా.. ఆషిక కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సిద్ధార్థ్ హీరోగా చేస్తున్న మిస్ యూ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఆమెనే ఈ విషయాన్ని తెలిపింది. మరి ఈ రెండు సినిమాలతో ఆషిక ఎలాంటి హిట్లు అందుకుంటుందో వేచి చూడాలి.