Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : RCB విజయంతో ముద్దుగుమ్మ ఇలా..!

ఐపీఎల్‌ ప్రారంభం అయినప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.

By:  Tupaki Desk   |   4 Jun 2025 4:08 PM IST
పిక్‌టాక్‌ : RCB విజయంతో ముద్దుగుమ్మ ఇలా..!
X

ఐపీఎల్‌ ప్రారంభం అయినప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. 17 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌లో ఒక్క ట్రోఫీని కూడా బెంగళూరు లిఫ్ట్‌ చేయలేక పోయింది. పలు సార్లు చేతి వరకు వచ్చి చేజారిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి బెంగళూరు కనబర్చిన ఆట తీరుకు ప్రతి ఒక్కరూ కప్‌ ఖాయం అనే నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే కోహ్లీ డ్రీమ్‌ నెరవేరింది. అద్భుతమైన విజయం సాధించిన ఆర్‌సీబీ జట్టు 18 ఏళ్ల స్వప్నంను నెరవేర్చుకుంది. సుదీర్ఘ కాలపు ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఈ విజయంను దేశంలోని క్రికెట్‌ అభిమానులు అంతా కూడా ఆస్వాదిస్తున్నారు అనడంలో సందేహం లేదు.

పంజాబ్‌ను ఓడించిన బెంగళూరు ఐపీఎల్‌ 18వ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో కర్ణాటకలో సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు ముఖ్య నగరాలు, పట్టణాల్లో జన సందోహం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది కర్ణాటకలో ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆర్‌సీబీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఆర్‌సీబీ విజయం సాధించిన వెంటనే ఏ స్థాయిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడో మనం చూశాం. మహేష్ బాబు సైతం కోహ్లీ అండ్ టీంకి అభినందనలు తెలియజేస్తూ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఆర్‌సీబీ విజయాన్ని కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ విభిన్నంగా సెలబ్రేట్‌ చేసుకుంది. కాఫీ షాప్‌ లో కాఫీ పై ఆర్‌సీబీ, విరాట్‌ కోహ్లీ 18 హ్యాష్ ట్యాగ్‌ను డిజైన్‌గా వేయించింది. లవ్‌ ఈమోజీను షేర్ చేయడంతో పాటు ఈ ఫోటోలను షేర్‌ చేసిన ఆషికా రంగనాథ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈ అమ్మడికి సహజంగానే ఆర్‌సీబీ గెలుపు కిక్‌ ఇచ్చి ఉంటుంది. ఆ ఆనందంతో ఇలా షేర్‌ చేసింది. కేవలం ఆషికా మాత్రమే కాకుండా ఎంతో మంది ముద్దుగుమ్మలు, స్టార్‌ హీరోలు అంతా కూడా ఆషికా మాదిరిగా కాకున్నా మరోలా ఆర్‌సీబీ విజయంను ఆస్వాదించారు, ఎంజాయ్‌ చేశారు, సన్నిహితులతో ఎంజాయ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఆషికా రంగనాథ్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈ అమ్మడు కళ్యాణ్ రామ్‌తో అమిగోస్‌ సినిమాలో నటించడం ద్వారా పరిచయం అయింది. ఆ సినిమా నిరాశ పరచినా వెంటనే ఈ అమ్మడికి నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో చేసేది లేక మళ్లీ కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ బ్రేక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. చిరంజీవి విశ్వంభర సినిమాలో ముఖ్య పాత్రలో ఈ అమ్మడు నటించినట్లు సమాచారం అందుతోంది. ఇక రవితేజ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందబోతున్న అనార్కలి సినిమాలోనూ ఈమె ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.