Begin typing your search above and press return to search.

నాగ్ తో ఆషిక.. ఫేవరెట్ అయ్యేలా ఉందే..!

కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2025 10:42 AM IST
నాగ్ తో ఆషిక.. ఫేవరెట్ అయ్యేలా ఉందే..!
X

కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కళ్యాణ్ రాం తో అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో సీతామహాలక్ష్మి రోల్ లో ఇంప్రెస్ చేసింది. నాగార్జునకు పర్ఫెక్ట్ జోడీగా ఆషిక నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఆ తర్వాత మళ్లీ అమ్మడికి సరైన ఛాన్స్ లు రాలేదు. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తితో వస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ లో..

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా డింపుల్ హయతి కూడా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ లో ప్రత్యక్షమయ్యారు ఈ టీం. రవితేజతో పాటు ఇద్దరు ముద్దుగుమ్మలు డింపుల్ హయతి, ఆషిక కూడా బీబీ స్టేజ్ మీద కనిపించారు. ఐతే ఆషికని చూడగానే నాగార్జున చాలా సంతోషంగా హగ్ చేసుకున్నారు.

నా సామిరంగ సినిమాతో తనతో కలిసి చేసిన ఆషిక అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు నాగ్. ఐతే ఆషిక నాగ్ జోడీ ఆఫ్ స్క్రీన్ కూడా ఇంప్రెస్ చేసింది. అది చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున మరోసారి ఆషికతో జత కట్టినా బాగుంటుందని అంటున్నారు. ఆషిక రంగనాథ్ తెలుగులోనే తన కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చూస్తుంది. నాగార్జున సినిమాతో సూపర్ హిట్ పడినా కూడా సరైన అవకాశాలు రాలేదు.

అక్కినేని ఫ్యాన్స్ జోడీ అదిరిపోయిందని..

ప్రస్తుతం రవితేజతో ఒక సినిమా చేసిన ఆషిక ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ఐతే బీబీ స్టేజ్ మీద నాగార్జునతో మరోసారి ఆషికని చూసిన అక్కినేని ఫ్యాన్స్ జోడీ అదిరిపోయిందని అంటున్నారు. మరోసారి ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగు హిట్ పెయిర్ కాబట్టి నాగార్జున కూడా ఆషికతో జత కట్టేందుకు రెడీ అనేలా ఉన్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా ఆషిక నటిస్తుంది. ఆ సినిమాపై కూడా అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.

సీనియర్ హీరోలకు సూపర్ హిట్ జోడీ అనిపించుకునే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకుంటుంది. మొన్నటిదాకా అనుష్క నాగ్ తో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకుంది. ఓ పక్క స్టార్ స్టేటస్ ఉన్నా ఈతరం స్టార్స్ తో నటిస్తూనే అనుష్క నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో జత కడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆషిక నాగార్జునతో మంచి జోడీ అనిపించుకునేలా ఉంది. ఇద్దరు మరో సినిమా చేసి అది హిట్ పడితే ఈ జోడీ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.