Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో ఫస్ట్‌ వెబ్‌ సిరీస్ ట్రైలర్‌ టాక్‌

హీరోగా తన విలక్షణ నటనతో మెప్పించిన ఆర్య తన ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ది విలేజ్‌ అనే వెబ్‌ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:27 AM GMT
స్టార్‌ హీరో ఫస్ట్‌ వెబ్‌ సిరీస్ ట్రైలర్‌ టాక్‌
X

హీరోగా తన విలక్షణ నటనతో మెప్పించిన ఆర్య తన ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ది విలేజ్‌ అనే వెబ్‌ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్ యొక్క ట్రైలర్ ను అమెజాన్ విడుదల చేసింది. ట్రైలర్ విడుదల తర్వాత సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

ది విలేజ్ టైటిల్ కి తగ్గట్లుగానే ఒక విలేజ్ లో జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించడం జరిగిందని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్ ను రూపొందించారు. మిలింద్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ కచ్చితంగా హర్రర్‌ కాన్సెప్ట్‌ లను ఇష్టపడే వారు ఆధరిస్తారని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్‌ లో 24న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అడవి సమీపంలోని ఒక గ్రామంలో హీరో ఫ్యామిలీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ పరిణామాలు ఏంటి.. వాటి నుంచి హీరో ఎలా బయట పడ్డాడు, ఇంతకు ఆ విలేజ్ యొక్క స్పెషలిటీ ఏంటి అనేది ఈ వెబ్‌ సిరీస్‌ కథ గా తెలుస్తోంది.

ఈ సిరీస్‌ లో ఆర్య తో పాటు దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్ మయాన్‌, పూజా రామచంద్రన్‌ తో పాటు పలువురు ప్రముఖ తమిళ నటీ నటులు నటించారు. ఈ వెబ్‌ సిరీస్ ను తమిళ్‌ తో పాటు తెలుగు ఇతర సౌత్‌ భాషల్లో మరియు హిందీ లో కూడా స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఒక వైపు హీరోగా నటిస్తూ స్టార్‌ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆర్య మరో వైపు విలన్‌ వేషాలు వేస్తున్నాడు. ఇదే సమయంలో ఇలా వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎంత వరకు సక్సెస్ అయ్యేను చూడాలి