Begin typing your search above and press return to search.

సాయిధ‌ర‌మ్ హీరోయిన్ ప్రేమలో ఖాన్ పుత్ర‌ర‌త్నం?

ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ డేటింగ్ పుకార్లు ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 3:00 AM GMT
సాయిధ‌ర‌మ్ హీరోయిన్ ప్రేమలో ఖాన్ పుత్ర‌ర‌త్నం?
X

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ న‌ట‌వార‌సుడు ఆర్యన్ ఖాన్ టాలీవుడ్ హీరో సాయిధ‌ర‌మ్ హీరోయిన్ తో ప్రేమ‌లో ఉన్నాడ‌నేది తాజా గుసగుస‌.. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ డేటింగ్ పుకార్లు ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్నాయి. తాజా క‌థ‌నాల‌ ప్రకారం .. అతడు ప్ర‌ముఖ‌ బ్రెజిలియన్ మోడల్ కం నటి లారిస్సా బోనెసితో సంబంధంలో ఉన్నాడు. స్టార్ కిడ్ ఆర్య‌న్ ఖాన్ లారిస్సా ఆమె తల్లి రెనాటా బోనేసితో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడని నెటిజ‌నుల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఇటీవలే లారిస్సా తల్లికి త‌న సొంత దుస్తుల బ్రాండ్ D'yavol X నుండి ఆర్య‌న్ స్వ‌యంగా బహుమతిని కూడా పంపాడ‌ట‌.

ఆర్యన్ ఖాన్ లారిస్సాతో కలిసి ఒక సంగీత కచేరీకి హాజరవుతున్న పాత వీడియో కూడా హఠాత్తుగా అంత‌ర్జాలంలో షికార్ చేస్తోంది. షారుఖ్ ఖాన్- ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ నటించిన ఆర్యన్ ఖాన్ సొంత‌ దుస్తుల బ్రాండ్ Dyavol X ప్ర‌మోష‌న్స్ కోసం కూడా లారిస్సా నటించింది.

అయితే ఈ యంగ్ పెయిర్ తమ రిలేషన్ షిప్ గురించి వస్తున్న రూమర్స్ పై ఇంకా స్పందించలేదు. ప్ర‌స్తుతానికి ఆర్యన్ సోదరి సుహానా కూడా లారిస్సాకు స‌న్నిహితంగా మెలుగుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించేంత‌గా వారి మ‌ధ్య‌ బంధం ఏర్పడింది. ఆర్య‌న్ ఆకస్మిక డేటింగ్ ఊహాగానాలు లారిస్సా గురించి తెలుసుకోవాలనే ఉత్సుక‌త‌ను పెంచింది. ఇంట‌ర్నెల్ లో ఇప్పుడు తీవ్రంగా ఆరాలు మొద‌ల‌య్యాయి.

లారిస్సా బోనేసి ఎవ‌రు? అంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడల్ కం నటి. మార్చి 1990లో జన్మించింది. 12 సంవత్సరాల వయస్సులో మోడలింగ్‌ను ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి మకాం మార్చింది. ఇక్క‌డ మోడ‌ల్ కం న‌టిగా రాణిస్తోంది. ఇప్ప‌టికే హిందీ- తెలుగు- పంజాబీ స‌హా బహుభాషా పరిశ్రమలలో ప‌ని చేస్తోంది.

లారిస్సా టాలీవుడ్ కి సుప‌రిచితురాలు. ఈ భామ మెగా హీరో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న `తిక్క` మూవీలో నటించింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ త‌న‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇదే విష‌య‌మై ఓ ఇంట‌ర్వ్యూలో సాయిధ‌రమ్ బ‌హిరంగంగానే మాట్లాడాడు. ``లారిస్సాను ప్రేమించాను.. ప్ర‌పోజ్ చేసాను.. కానీ తిర‌స్క‌రించింది`` అని సాయిధ‌ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

లారిస్సా బోనేసి బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ - ఖునాల్ కెమ్ము నటించిన `గో గోవా గాన్` లో న‌టించింది. జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్ నటించిన దేశీ బాయ్జ్ లో ప్రత్యేక నంబర్ చేసింది. సుబా హోనే నా దే చిత్రంలోను న‌టించింది. 2021లో మస్తాన్ బర్మావల్లా - అబ్బాస్ బర్మావాలా `పెంట్‌హౌస్‌`లో కనిపించింది. ఈ చిత్రంలో వాలుచా డి సౌజా, మౌని రాయ్, అర్జున్ రాంపాల్, శర్మన్ జోషి త‌దితరులు న‌టించారు.

సూరజ్ పంచోలితో డిమ్ డిమ్ లైట్, టైగర్ ష్రాఫ్‌తో యు కమింగ్, యో యో హనీ సింగ్‌తో జామ్-ది క్యాసినో సాంగ్, గురు రంధవాతో సుర్మా సుర్మా, విశాల్ మిశ్రా ఆవో నా వంటి అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఇటీవల స్టెబిన్ బెన్ - తు మైలే దిల్ ఖిలేలో కనిపించింది. ఇది ఇంటర్నెట్‌లో గొప్ప‌ ప్రశంసలు అందుకుంది. ఇంకా లారిస్సా ప్రతిష్టాత్మక బ్రాండ్‌లలో న‌టించింది. సల్మాన్ ఖాన్-జాన్ అబ్రహం వంటి వారితో స్క్రీ స్పేస్‌ను పంచుకుంది.

మోడలింగ్‌తో విజయవంతంగా కెరీర్ ని ప్రారంభించిన తర్వాత, బ్రెజిలియన్ బ్యూటీ టాలీవుడ్లోను ప్ర‌వేశించింది. తిక్క, పెంట్ హౌస్, నెక్స్ట్ ఏంటి? వంటి సినిమాల్లో కనిపించింది. తిక్క చిత్రానికి సునీల్ కుమార్ రెడ్డి - బి.ఆర్.దుగ్గినేని క‌ర్త‌లు. మన్నారా చోప్రా ఇందులో మ‌రో క‌థానాయిక‌. నెక్స్ట్ ఏంటి? 2018లో విడుదలైంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, తమన్నా భాటియా, నవదీప్, పూనమ్ కౌర్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. లారిస్సా సోషల్ మీడియా ఔత్సాహికురాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో 562కె ఫాలోవర్లతో భారీ ఫాలోయింగ్‌ను క‌లిగి ఉంది. త‌ను ఫిట్‌నెస్ ఫ్రీక్ అని సోష‌ల్ మీడియా పోస్ట్‌లను బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లారిస్సా గొప్ప నర్తకి కూడా.

ఆర్యన్ ఖాన్ ఇప్పటికే తన విజయవంతమైన దుస్తుల బ్రాండ్‌తో వ్యాపారవేత్తగా తన కెరీర్ మార్గంలో దూసుకుపోతున్నాడు. అతడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఇప్పుడే నటించే ఆలోచన లేదు. ప్ర‌స్తుతానికి తన తొలి వెబ్ సిరీస్ `స్టార్‌డమ్‌`కి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ నేపథ్యంలో విభిన్న‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్ ని నిర్మిస్తోంది.