Begin typing your search above and press return to search.

వర్కౌట్ వీడియోతో పిచ్చెక్కిస్తున్న Mr.X

తాజాగా వీడియోను షేర్ చేసి అందరిని సర్‌ ప్రైజ్‌ చేశాడు. షాకింగ్ ఫిజిక్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ తో ఆర్య కనిపించి ఆకట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 7:29 AM GMT
వర్కౌట్ వీడియోతో పిచ్చెక్కిస్తున్న  Mr.X
X

తమిళ హీరో ఆర్య వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన వెంకటేష్ సైంధవ్ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించాడు.

ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే సినిమా కి రెడీ అవుతున్నాడు. మను ఆనంద్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం ఆర్య సిక్స్ ప్యాక్ బాడీ తో రెడీ అయ్యాడు. తాజాగా వీడియోను షేర్ చేసి అందరిని సర్‌ ప్రైజ్‌ చేశాడు. షాకింగ్ ఫిజిక్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ తో ఆర్య కనిపించి ఆకట్టుకున్నాడు.

సిక్స్ ప్యాక్ బాడీతో పాటు కండలు పెంచి అబ్బుర పరిచాడు. మిస్టర్ ఎక్స్ సినిమా కోసం ఆర్య ఈ రకమైన లుక్ తో రెడీ అవుతున్నాడు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈమధ్య కాలంలో షారుఖ్‌ ఖాన్‌ తర్వాత ఈ స్థాయి కండలు పెంచడం ఆర్య కే సాధ్యం అన్నట్లుగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మిస్టర్ ఎక్స్ సినిమాలో సీనియర్ హీరో శరత్‌ కుమార్‌ తో పాటు మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ గా అనఘ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ స్థాయి ఫిజిక్ తో కనిపించబోతున్న ఆర్యకు మిస్టర్‌ ఎక్స్‌ హిట్‌ ను ఇస్తుందేమో చూడాలి.