ఆర్యన్ ఖాన్ సిరీస్ లో ఆ స్టార్ హీరో పిల్లల క్యామియో!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 2:00 PM ISTబాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. మామూలుగా హీరోల కొడుకులు ఎక్కువగా హీరోలే అవుతారు. కానీ షారుఖ్ ఖాన్ కొడుకు మాత్రం యాక్టింగ్ వైపు కాకుండా డైరెక్షన్ వైపు అడుగులేసి ఆ దిశగా సక్సెస్ అవాలని చూస్తున్నాడు. అయితే ఆర్యన్ ఖాన్ తన డెబ్యూని సినిమాతో చేయడం లేదు.
ఆర్యన్ ఖాన్ ముందుగా ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఈ సంవత్సరమే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మొదటి వెబ్ సిరీస్ కదా అని దీన్నేమీ ఆర్యన్ నార్మల్ గా తెరకెక్కించడం లేదు. చాలా భారీ క్యాస్టింగ్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు ఆర్యన్. ఇందులో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ సల్మాన్ ఖాన్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ లాంటి వారు గెస్ట్ రోల్స్ చేయనుండటంతో ఈ సిరీస్ పై భారీ బజ్ నెలకొంది.
సైఫ్ అలీ ఖాన్ సంతానం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ సిరీస్ లో నటించారని రీసెంట్ గా సైఫ్ వెల్లడించాడు. వేవ్స్ 2025 సమ్మిట్ లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ తో మాట్లాడుతూ, సైఫ్ ఈ విషయాన్ని చెప్పాడు. అంతేకాదు, తాను ఆల్రెడీ ఈ సిరీస్ ప్రివ్యూ చూశానని, సిరీస్ ఎంతో అద్భుతంగా వచ్చిందని వెల్లడించాడు.
ఈ సిరీస్ లో సారా, ఇబ్రహీం ఇద్దరూ కొన్ని నిమిషాల పాటూ కనిపించనున్నారని చెప్పారు. బా***డ్స్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఒక సాధారణ వ్యక్తి అతని ఫ్రెండ్స్ గ్రూప్ తో కలిసి బాలీవుడ్ లో తమకంటూ తగిన గుర్తింపు, పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న జర్నీగా రూపొందింది. ఈ సిరీస్ తో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తాడో చూడాలి.