Begin typing your search above and press return to search.

కొడుకును చూసి గ‌ర్వ‌ప‌డుతున్న షారుఖ్

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ తోనే ఆర్య‌న్ ఖాన్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   10 May 2025 3:00 AM IST
Aryan Khan Makes Bold Directorial Debut With Netflix Series
X

ఓ మామూలు వ్య‌క్తి, అతని ఫ్రెండ్స్ క‌లిసి బాలీవుడ్ లో ఫేమ్ సంపాదించ‌డానికి చేసే కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. అదే బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ లో జ‌రిగే ప్ర‌తీ అంశాన్నీ బోల్డ్ గా చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ కు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ తోనే ఆర్య‌న్ ఖాన్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. అయితే ఈ సిరీస్ గురించి ఏకంగా నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ స‌రండోస్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వేవ్స్2025 స‌మ్మిట్ లో సైఫ్ అలీ ఖాన్ తో టెడ్ మాట్లాడుతూ ఈ షో గురించి చెప్పి ఊరించారు.

ఈ సిరీస్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా స‌ర‌దాగా ఉంద‌ని, కాక‌పోతే ఇంకా ఈ షో గురించి ఆడియ‌న్స్ వ‌ర‌కు వెళ్ల‌లేద‌ని, దీన్ని చూశాక ఆడియ‌న్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటార‌ని, అంద‌రినీ ఈ సిరీస్ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలిపారు. బాలీవుడ్ లో ప‌లువురు స్టార్లు ఈ సిరీస్ లో గెస్ట్ రోల్స్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ సిరీస్ లో షారుఖ్ ఖాన్, ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ణ్‌వీర్ సింగ్, ఆలియా భ‌ట్, సారా అలీ ఖాన్, ఇబ్ర‌హీం అలీ ఖాన్ గెస్ట్ రోల్స్ చేస్తుండ‌టంతో దీనిపై అంద‌రికీ భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అందుకే ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ‌వుతుందా అని అంద‌రూ ఎంత‌గానో ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ షో కు ఇంత హైప్ రావ‌డానికి కార‌ణం ఆర్య‌న్ ఖాన్ షారుఖ్ కొడుకు అవ‌డం మూలంగానే అని అంటున్నారు. ఎంత షారుఖ్ కొడుకైనా కంటెంట్ బాలేక‌పోతే ఆర్య‌న్ ఖాన్ సిరీస్ చేశాడ‌నే కార‌ణంతో ఆడియ‌న్స్ వాటిని చూసే రోజులు పోయాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్ తో షారుఖ్ ఖాన్ త‌న కొడుకు విష‌యంలో చాలా గ‌ర్వ‌ప‌డ‌తార‌ని అంటున్నారు.