Begin typing your search above and press return to search.

సైంధవ్.. మరో గన్ను లాంటి క్యారెక్టర్

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కోలీవుడ్ స్టార్ ఆర్య సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 12:40 PM GMT
సైంధవ్.. మరో గన్ను లాంటి క్యారెక్టర్
X

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మానేసి.. చాలామంది హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ హీరోల్లో ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న విక్టరీ వెంకటేశ్ కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సైంధవ్ అనే థ్రిల్లర్ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారు.


ఈ చిత్రం వెంకటేశ్ కు 75 మైల్ స్టోన్ మూవీ కావడం విశేషం. అందుకే సైంధవ్‌ ను మెమరబుల్ గా చేయడానికి భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు సినిమాలో భాగమయ్యారు. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం 8 మంది కీలక నటీనటుల చుట్టూ తిరుగుతుందని తెలిసింది.

అయితే ఇప్పటివరకు 7 పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. తాజాగా నేడు(ఆగస్ట్ 30) సినిమాలోని మరో కీలక పాత్రను రివీల్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కోలీవుడ్ స్టార్ ఆర్య సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ పాత్రను మానస్‌గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో ఆర్య.. ఫార్మల్ డ్రెస్ లో స్టైలిష్ లుక్‌ లో కనిపించారు. చేతిలో మెషిన్ గన్‌తో ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు. ఇక సినిమాలోని మిగతా ఏడు పాత్రల్లో వెంకటేశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ నటిస్తున్నారు. ఇంతమంది టాలెంట్ యాక్టర్స్ ఒకే సినిమాలో నటించడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. పాన్ ఇండియా రేంజ్ లో డిసెంబర్ 22 క్రిస్మస్ సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో వెంకటేశ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.