Begin typing your search above and press return to search.

బాబోయ్‌... ఏడాదిలో ఇంత మార్పా?

తాజాగా ఆర్య సోషల్‌ మీడియా లో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   18 March 2024 8:24 AM GMT
బాబోయ్‌... ఏడాదిలో ఇంత మార్పా?
X

వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు ఆర్య ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మరింతగా పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ తో కలిసి సైంధవ్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య ప్రస్తుతం మిస్టర్ ఎక్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

గత ఏడాది కాలంగా ఆర్య వర్కౌట్స్ చేస్తున్నాడు. మొన్నటి వరకు కాస్త లావుగా, బొద్దుగా ఉన్న ఆర్య ఇప్పుడు చాలా సన్నగా కండలు తిరిగిన ఫిజిక్‌ తో సర్‌ ప్రైజ్ చేశాడు. పొట్ట కరగడం తో పాటు, ముందు వెనుక కండలతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా తన ఫిజిక్ ను మార్చాడు.

తాజాగా ఆర్య సోషల్‌ మీడియా లో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. బాబోయ్ ఏడాది కాలంలో మరీ ఇంత మార్పు ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్‌ ఎక్స్‌ కోసం ఆర్య ఎంతగా కష్టపడుతున్నాడో ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే మిస్టర్ ఎక్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. ఏ క్షణంలో అయినా సినిమా యొక్క షూటింగ్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అని తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఆర్యను చూడని కొత్త లుక్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.