సీక్వెల్ కోసం బాక్సింగ్‌కు రెడీ అవుతున్న ఆర్య!
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించి ఆర్యకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
By: Tupaki Desk | 15 May 2025 5:00 AM ISTతమిళ క్రేజీ హీరో ఆర్య నటించిన పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా `సర్పట్ట పరంబరై`. పా. రంజిత్ దీనికి దర్శకత్వం వహించారు. దుశారా విజయన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ కోసం హీరో ఆర్య కఠోరంగా శ్రమించి బాక్సర్ లుక్ లోకి ట్రాన్స్ ఫార్మ అయ్యారు. ఇందులో ముందు బొద్దుగా కనిపించి ఆ తరువాత బాక్సర్ లుక్ లోకి ఆర్య మారడం తెలిసిందే. ఇందు కోసం చాలా రోజులు జిమ్‌లో కఠోరంగా శ్రమించారు ఆర్య.
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించి ఆర్యకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2021 జూలై 21న విడుదలైన ఈ సినిమా దర్శకుడు పా.రంజిత్‌కు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు దీనికి సీక్వెల్‌ని చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని చేయబోతున్నామని హీరో ఆర్య ఇటీవల కన్ఫర్మ్ చేశాడు. ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ `సర్పట్ట పరంబరై` సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
`సర్పట్ట పార్ట్ 2` షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం దర్శకుడు పా.రంజిత్ సార్ `వెట్టువం` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత `సర్పట్ట పార్ట్ 2` షూటింగ్‌ని ప్రారంభిస్తారు` అని కీలక అప్‌డేట్ ఇచ్చేశారు. `సర్పట్ట` కథ 1970వ దశకం నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే. పార్ట్ 2ని కూడా అదే టైమ్ పీరియెడ్ నేపథ్యంలో తెరపైకి తీసుకొస్తారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ని మేకర్స్ చేయనున్నారని కోలీవుడ్ సమాచారం.
ఆర్య ప్రస్తుతం తమిళంలో రూపొందుతున్న`మిస్టర్ ఎక్స్`లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని వివిధ లొకేషన్‌లలో జరుగుతోంది. మను ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, మంజు వారియర్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
