Begin typing your search above and press return to search.

న‌టుడు అర‌వింద్ స్వామి తండ్రి ఎవ‌రో తెలుసా?

అరవింద్ స్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 21 ఏళ్ల వయసులో నట‌న‌లో ప్ర‌వేశించిన అరవింద్ సామి యువతుల గుండెల్ని గెలుచుకున్నారు

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:30 PM GMT
న‌టుడు అర‌వింద్ స్వామి తండ్రి ఎవ‌రో తెలుసా?
X

అరవింద్ స్వామి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 21 ఏళ్ల వయసులో నట‌న‌లో ప్ర‌వేశించిన అరవింద్ సామి యువతుల గుండెల్ని గెలుచుకున్నారు. ల‌క్ష‌లాదిగా మ‌హిళా ఫ్యాన్స్ ఉన్న టాప్ హీరోగా పాపుల‌రయ్యారు. ముఖ్యంగా మ‌ణిర‌త్నం సినిమాల్లో రొమాంటిక్ హీరోగా తెరంగేట్రం చేసి, ఇప్పుడు ఉత్తమ విలన్ గా, గొప్ప‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా 'తని ఒరువన్' సినిమా ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇందులో విల‌న్ గా అతడి అభినివేశం మైమ‌రిపించింది. కొన్నాళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉన్న అరవింద్ స్వామి ఈ సినిమా ద్వారా మళ్లీ తెరపైకి వచ్చాడు. త‌ని ఒరువ‌న్ త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కాగా, తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా రీమేకై ఇక్క‌డా ఘ‌న‌విజ‌యం సాధించింది. తెలుగు రీమేక్ లోను అర‌వింద్ స్వామి న‌ట‌నకు ప్ర‌శంస‌లు కురిసాయి. మ‌ణిరత్నం న‌వాబ్ చిత్రంలోను నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో స్వామి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇటీవ‌ల అర‌వింద స్వామి ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. త‌ని ఒరువ‌న్ సీక్వెల్ లోను అత‌డు న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం ఉంది.

నిజానికి కొంద‌రు నటీనటుల వ్య‌క్తిగ‌త స‌మాచారం ప‌రిమితంగానే అందుబాటులో ఉంటుంది. కొంద‌రి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు అరుదుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఆ విధంగా అరవింద్ స్వామి మరో వైపునకు సంబంధించిన సమాచారం ఇప్పుడు వెలువడింది. అరవింద్ సామి తండ్రి 'వీడి సామి' అని నేటి వరకు అందరికీ తెలుసు. అయితే అతను అరవింద్ సామి అస‌లు తండ్రి కాదు. ప్రముఖ సీరియల్ నటుడు ఢిల్లీ కుమార్ అరవింద్ సామికి నిజమైన తండ్రి అని ఇప్పుడు ప్ర‌చారం సాగుతోంది. ఈ విషయాన్ని నటుడు ఢిల్లీ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు స్వామి అనే కుమారుడు ఉన్నాడని, అత‌డిని దత్తత తీసుకున్నానని చెప్పాడు.