అక్కడ రిజెక్ట్ అయిన స్టార్… ఇప్పుడు రూ. 3300 కోట్ల కింగ్.. అరవింద్ స్వామి షాకింగ్ జర్నీ
బొంబాయి, మిన్సార కనవు చిత్రాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే ఆయన సినిమాలకు హఠాత్తుగా దూరమయ్యారు.
By: Madhu Reddy | 19 Jun 2026 5:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోలు ఆ తర్వాత కాలంలో మాయమైపోవడం చూస్తుంటాం. కానీ, ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి లైఫ్ స్టోరీ వింటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒకప్పుడు కాలేజీ నాటకాల్లో నటించేందుకే పనికిరావంటూ రిజెక్షన్ ఎదుర్కొన్న ఈ చాక్లెట్ బాయ్.. వెండితెరపై స్టార్‌డమ్ అందుకోవడమే కాకుండా, ఆ తర్వాత సినిమాలను వదిలేసి బిజినెస్ రంగంలో ఏకంగా రూ.3,300 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక సాధారణ మోడల్ నుంచి కోటీశ్వరుడైన బిజినెస్ కింగ్‌గా మారిన ఆయన క్రేజీ జర్నీ ముచ్చట్లు చూద్దాం..
కాలేజీలో రిజెక్షన్.. మణిరత్నం కంటపడ్డ మోడల్:
చెన్నైలోని లోయోలా కాలేజీలో చదువుకునే రోజుల్లో అరవింద్ స్వామి అక్కడి థియేటర్ గ్రూప్‌లో చేరారు. కానీ, వారు అతనికి కనీసం స్టేజ్ ఎక్కే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పంపించేశారు. దాంతో పాకెట్ మనీ కోసం క్యాజువల్‌గా మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ టైమ్‌లో ఆయన నటించిన ఒక యాడ్ చూసి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం పిలిచి మరీ తన దళపతి (1991) సినిమాలో కలెక్టర్ రోల్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన 'రోజా' సినిమాతో అరవింద్ స్వామి రాత్రికి రాత్రే స్టార్ హీరో అయిపోయారు.
స్టార్డమ్ పీక్స్‌లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై:
బొంబాయి, మిన్సార కనవు చిత్రాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే ఆయన సినిమాలకు హఠాత్తుగా దూరమయ్యారు. ఇక నిజానికి చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్న అర్వింద్ స్వామికి సినిమాలపై పెద్దగా ప్లాన్స్ లేవు. ఇక ఆ తర్వాత 2005లో ఆయన స్థాపించిన 'టాలెంట్ మాక్సిమస్' అనే పేరోల్ అండ్ స్టాఫింగ్ కంపెనీ వాల్యూ 2022 నాటికే దాదాపు రూ. 3,300 కోట్లకు చేరింది.
ప్రమాదం, పక్షవాతం.. వ్యక్తిగత జీవితంలో తుఫాను:
వ్యాపారంలో సక్సెస్ అవుతున్న సమయంలోనే 2005లో ఆయనకు ఘోర ప్రమాదం జరిగింది. వెన్నుముక గాయం వల్ల ఒక కాలుకు పాక్షిక పక్షవాతం వచ్చి నడవలేని స్థితికి చేరారు. దాదాపు 5 ఏళ్ల పాటు నరకం చూస్తూ చికిత్స తీసుకున్నారు. ఇక అదే సమయంలో భార్య గాయత్రితో విభేదాలు వచ్చి 2010లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇద్దరు పిల్లల బాధ్యతను ఆయనే చూసుకున్నారు.
ఫీనిక్స్ పక్షిలా సెకండ్ ఇన్నింగ్స్ కమ్‌బ్యాక్:
అన్ని కష్టాలను దాటుకుని, బరువు తగ్గి మళ్లీ మణిరత్నం సినిమా 'కడలి' తోనే రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ధృవ' ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ లో స్టైలిష్ విలన్‌గా, 'తలైవి'లో ఎంజీఆర్ పాత్రలో జీవించేసి నటుడిగా తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించారు. రీసెంట్‌గా 'మెయ్యళగన్' సినిమాతో మెప్పించిన ఆయన, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'నవరస'తో డైరెక్టర్‌గా కూడా మారి వెండితెరపై సంచలనాలు సృష్టిస్తున్నారు.
కాలేజీ స్టేజ్ మీద యాక్టింగ్ చేయడానికి పనికిరావని పంపించేసిన చోట నుంచే.. రొమాంటిక్ హీరోగా, కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్‌గా, పవర్‌ఫుల్ విలన్‌గా అర్వింద్ స్వామి ఎదిగిన తీరు ఒక అద్భుతం. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు, ప్రమాదాలు ఎదురైనా ఫీనిక్స్ పక్షిలా ఎలా దూసుకురావాలో చెప్పడానికి అరవింద్ స్వామి జర్నీనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
