Begin typing your search above and press return to search.

నటి సురేఖ వాణి వీడియో వైరల్‌

టాలీవుడ్ లో స్టార్‌ హీరోలకు హీరోయిన్స్ కు అమ్మగా, అక్కగా, అత్తగా నటించి తనదైన గుర్తింపు దక్కించుకున్న నటి సురేఖ వాణి

By:  Tupaki Desk   |   23 Dec 2023 11:30 AM GMT
నటి సురేఖ వాణి వీడియో వైరల్‌
X

టాలీవుడ్ లో స్టార్‌ హీరోలకు హీరోయిన్స్ కు అమ్మగా, అక్కగా, అత్తగా నటించి తనదైన గుర్తింపు దక్కించుకున్న నటి సురేఖ వాణి. చిన్న వయసులోనే వయసుకు మించిన పాత్రల్లో నటించిన సురేఖ వాణి హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉంటారు అనడంలో సందేహం లేదు.

సినిమాల్లో కాస్త డీ గ్లామర్‌ గా కనిపించినా కూడా సోషల్ మీడియాలో ఆమె ఒరిజినల్‌ అందంను చూడవచ్చు. కూతురు తో పోటీ పడి మరీ అందంగా సురేఖ వాణి కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలు కాస్త తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో సందడి కొనసాగుతూనే ఉంది.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా సురేఖ వాణి తన అందంతో అందరిని సర్‌ ప్రైజ్ చేశారు. సాధారణంగా చీర కట్టు లో సురేఖ వాణి చాలా అందంగా ఉంటారు అనే అభిప్రాయం ఉంది. అలాంటిది లైట్ పింక్ కలర్‌ చీర లో సురేఖ వాణి సన్నగా నాజూకుగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

సురేఖ వాణి ఫోటోలు వైరల్‌ అయినట్లుగా, తాజాగా ఆమె చీర కట్టులో ఫోటోలకు ఫోజు ఇస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య సురేఖ వాణి కూతురు సుప్రీత సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ లేదు.

సురేఖ వాణికి ఉన్న క్రేజ్ మరియు మంచి పేరు నేపథ్యంలో సుప్రిత కి టాలీవుడ్ లో గ్రాండ్ వెల్‌ కమ్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి సుప్రిత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా, సురేఖ తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేయాలి అనుకుంటున్నారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.