Begin typing your search above and press return to search.

అక్కడ మన మరో సినిమాపై నిషేధం

ఇండియన్ సినిమా గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:46 AM GMT
అక్కడ మన మరో సినిమాపై నిషేధం
X

ఇండియన్ సినిమా గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇండియన్ సినిమాల కంటెంట్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌ లో భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్న మన సినిమాలకు అప్పుడప్పుడు కొన్ని దేశాల్లో నిషేధం తప్పడం లేదు.

ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన సినిమాలను గల్ఫ్‌ దేశాలతో పాటు మరి కొన్ని దేశాలు నిషేదించడం మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. గత నెలలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హృతిక్‌ రోషన్ 'ఫైటర్‌' సినిమా ను గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే.

తాజాగా మరో బాలీవుడ్‌ మూవీని కూడా గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది. యామీ గౌతమ్ మరియు ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఆర్టికల్‌ 370 ప్రదర్శణ ను గల్ఫ్‌ దేశాలు నిదేషిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

పాకిస్తాన్‌ కు సంబంధించిన కొన్ని సున్నిత సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గల్ఫ్‌ దేశాల్లో రిలీజ్ కి కటినమైన సెన్సార్‌ అడ్డు గోడ దాటాల్సి ఉంటుంది. సున్నితమైన అంశాలు ఏమైనా ఉంటే కచ్చితంగా సినిమాను అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పుకోరు.

ఆదిత్య సుహాస్‌ జంభలే దర్శకత్వంలో రూపొందిన ఆర్టికల్‌ 370 మొదటి మూడు రోజుల్లో దాదాపుగా రూ.22 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆర్టికల్‌ 370 ఇండియన్‌ పొలిటికల్‌ రంగంలో అనూహ్యమైన ప్రభావం చూపించిన విషయం తెల్సిందే. అలాంటి సినిమాను గల్ఫ్‌ లో బ్యాన్‌ చేయడం చేయడం జరిగింది.