Begin typing your search above and press return to search.

రచ్చగెలిచి ఇంటగెలిచిన జాంబిరెడ్డి..!

By:  Tupaki Desk   |   8 April 2021 10:30 AM GMT
రచ్చగెలిచి ఇంటగెలిచిన జాంబిరెడ్డి..!
X
ఈ మధ్యకాలంలో డెబ్యూ హీరోలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా బెదరకుండా, ఫస్ట్ సినిమా అనే ఫియర్ కనిపించకుండా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన హిట్ సినిమాల్లో ఒకటి జాంబిరెడ్డి. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు దక్కించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబిస్ సినిమా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ జాంబిస్ జానర్ సినిమా కావడం విశేషం. అయినా ఈ జానర్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు జాంబి టీమ్. అయితే ఈ సినిమాతో కుర్రహీరో తేజ సజ్జా హీరోగా డెబ్యూ అయ్యాడు.

ఇదివరకు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ హీరోగా ఇదే తొలి సినిమా కావడంతో జాంబిరెడ్డికి మెగాఫ్యామిలీ సపోర్ట్ లభించింది. మెగాహీరోల సపోర్ట్ తో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు తేజ. అయితే థియేట్రికల్ గా హిట్ అందుకున్న జాంబిరెడ్డి సినిమా.. అటు డిజిటల్ గా కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ ఈ సినిమాను హోలీ సందర్బంగా మార్చ్ 28న స్టార్ మా ఛానల్లో ప్రసారం చేశారు. అయితే అంతా కొత్త టీమ్ కొత్త హీరో అయినప్పటికి జనాలు ఈ సినిమాను బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే జాంబిరెడ్డి మూవీ 9.7 టిఆర్పి రేటింగ్ నమోదుచేసి బుల్లితెరపై కూడా హిట్ అనిపించుకుంది. పూర్తి ఫన్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ఏడాది ప్రసారమైన క్రాక్ సినిమా తర్వాత మంచి టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న సినిమాగా జాంబిరెడ్డి నిలిచింది. ఈ సినిమాను రాజశేఖర వర్మ నిర్మించగా.. ఆనంది హీరోయిన్ గా నటించింది.