Begin typing your search above and press return to search.

కరోనాను దీంతో జయించానంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   18 April 2020 10:15 AM IST
కరోనాను దీంతో జయించానంటున్న హీరోయిన్
X
కరోనా.. ఇప్పుడు దీని బారిన పడి అమెరికాలో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్నటికి నిన్న కరోనాతో 24 గంటల్లో అమెరికాలో 4591మంది మరణించారు. కానీ భారత్ లో మాత్రం కరోనా ఆస్థాయిలో ప్రభావం చూపడం లేదు. కరోనా పేరు చెబితే అందరూ భయపడిపోవడమే కానీ.. దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది అసలు బాధ. ఇక దాన్ని జయించిన వారికి కరోనా అంటే ఏంటో దాని బాధేంటో తెలుస్తుంది.

తాజాగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటి జోయా మోరానీ తన అనుభవాలను పంచుకుంది. కరోనాతో ఎంత నరకం అనుభవించానో ఇన్ స్టాగ్రామ్ లో, ఒక ఇంగ్లీష్ డైలీతో పంచుకుంది. కరోనా ఎంత ప్రమాదకరమో చెప్పింది. తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో కూడా వివరించింది.

నటి జోయా మొరానో మాట్లాడుతూ.. ‘కరోనా సోకగానే.. లక్షణాలు బయటపడగానే తాను కుటుంబ సభ్యులకు దూరంగా ఒక గదిలో స్వీయ నిర్బంధంలో ఉన్నానని తెలిపింది. అందుకే కరోనా ఫ్యామిలీకి సోకలేదంది. అనంతరం ఆస్పత్రికి మారానని వివరించింది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తాను తులసీనీళ్లు, పసుపు కలిపిన పాలు తాగనని.. యోగ చేయడం వల్ల నాలో ధైర్యం వచ్చిందని తెలిపారు. యోగానే తనను కరోనా నుంచి బయటపడేసిందని వివరించింది.

దేవుడు తనను యోగా నుంచి బయటప డేయడానికే ఆరేళ్ల వయసు అప్పటి నుంచే దీన్ని నేర్పించాడని.. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో యోగా చేస్తూనే ఒత్తిడి తగ్గించుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకున్నానని తెలిపింది. ఇక తనకు ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు జీవితంపై ఆశలు కల్పించారని.. వారి ప్రేమ, దయతో చూశారని.. వారి సేవలు గ్రేట్ అంటూ ప్రశంసించారు.

కరోనాతో తన శరీరం పూర్తిగా దెబ్బతిందని నటి జోయా తెలిపింది. ఇప్పటికీ దగ్గు పోవడం లేదని.. మరో 14 రోజులు క్వారంటైన్ లోనే ఉంటానని వివరించింది. కరోనా అనుభవాలు నరకం చికిత్స పొందిన భయాన అనువాలను చెప్పుకొచ్చింది.