Begin typing your search above and press return to search.

జోగిని శ్యామల పై జీరో ఎఫ్ఐఆర్..మహిళను వివస్త్రను చేసి వీడియో తీసినట్లు ఆరోపణ!

By:  Tupaki Desk   |   16 March 2021 1:30 PM GMT
జోగిని శ్యామల పై జీరో ఎఫ్ఐఆర్..మహిళను వివస్త్రను చేసి వీడియో తీసినట్లు ఆరోపణ!
X
ప్రముఖ నటి జోగిని శ్యామల పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎల్లప్పుడూ ఆటపాటలతో.. బోనాల జాతరలో సందడి చేసే శ్యామల పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దైవదర్శనానికి వెళ్లిన ఓ మహిళ పై దాడికి పాల్పడి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితురాలు.. శ్యామలతో పాటు మరికొంత మందిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ ఏరియాలో నివసించే స్రవంతి అనే మహిళ తన తల్లి తలారి సంధ్య మార్చి 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శనానికి వెళ్లారట. దర్శనం అయిపోయి తిరిగి వస్తుండగా.. జోగిని శ్యామల తానుంటున్న ప్రదేశానికి రమ్మని పిలిచిందట.

తల్లి, కుమార్తె అక్కడికి వెళ్లేసరికి అక్కడ కొంతమంది ఉండేసరికి స్రవంతి లోపలికి వెళ్ళలేదు. మరోసారి శ్యామల పిలిచేసరికి తప్పక లోపలికి వెళ్లారట. ఆ తర్వాత తనను వివస్త్రగా చేసి శ్యామల వీడియోలు తీసినట్లు బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అలాగే తన కుటుంబాన్ని, భర్తను దూషించినట్లుగా మహిళ ఆరోపించింది. శ్యామల పై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు జోగిని శ్యామలతో పాటు మిగతా కొంతమంది పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం. మార్చి 13న బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. సోమవారం ఈ కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.